Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాస్‌ గుర్తు టెన్షన్‌

జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌ జాబితాలో పెట్టొచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, గ్లాజు గ్లాస్‌ గుర్తుపై స్వతంత్రులు పోటీ చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే టీడీపీ పార్టీకి నష్టం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది.

New Update
Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాస్‌ గుర్తు టెన్షన్‌

Also Read: జ్ఞాన‌వాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!

అయితే, 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లలో మాత్రమే జనసేన (Janasena) పోటీ చేయనుంది. మిగిలిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లలోనూ  గ్లాజు గ్లాస్‌ గుర్తుపై స్వతంత్రులు పోటీ చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే టీడీపీకి (TDP) పడాల్సిన జనసేన ఓట్లకు భారీ గండం పడే ఛాన్స్ కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు కావాలని అభ్యర్థులను పెడితే టీడీపీకి పెద్ద దెబ్బే తగులుతుంది. దీంతో, జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలంటూ యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌ హెచ్చరిక జారీ చేశారు.


Also Read: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..!

గత నెల జనవరి 25న జనసేన పార్టీ (Janasena Party) తరపున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఈసీ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని  రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్‌ దాఖలైంది. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్‌. గతేడాది మే 13న గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (Praja Congress) దరఖాస్తు చేసుకుంది. అయితే, విచారణలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించింది.

Advertisment
తాజా కథనాలు