Pawan Kalyan : పంచాయతీలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం!

స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీలకు శుభవార్త వినిపించారు.మైనర్‌ పంచాయతీలుగా ఉన్నవాటికి రూ.100 నుంచి 10 వేలను, మేజర్‌ పంచాయతీలకు రూ. 250 నుంచి 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన వివరించారు.

Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్
New Update

Deputy CM Pawan Kalyan : స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) దగ్గర పడుతున్న వేళ ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పంచాయతీలకు శుభవార్త వినిపించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శాఖలకు నిధులు పెంచుతున్నట్లు ఉపముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామగ్రామాన ఇండిపెండెన్స్ వేడుకలను ఎంతో ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు.

మైనర్‌ పంచాయతీలుగా ఉన్నవాటికి రూ.100 నుంచి 10 వేల రూపాయాలను, మేజర్‌ పంచాయతీలకు రూ. 250 నుంచి 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన వివరించారు. ఆగస్టు 15 వేడుకలకు ముందే ప్రతి పాఠశాలలో కూడా డిబేట్లు, వ్యాసరచన పోటీలు, క్విజ్‌ వంటి వాటిని విద్యార్థులకు నిర్వహించాలని తెలిపారు.

విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆరోజున ప్రతి పాఠశాలలో కూడా స్వాతంత్య్ర సమరయోధులను, సైనికులను , కార్మిక సోదరులను సన్మానించి సత్కరించాలని పవన్‌ సూచించారు. ఆ రోజున పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచాలని తెలిపారు.

Also read: దూసుకొస్తున్న మూడు గ్రహశకలాలు!

#independence-day #andhra-pradesh #pawan-kalyan #major-pachayat #minor-panchayat
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe