SRH: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ హీరోకే కెప్టెన్ బాధ్యతలు!

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ ఐపీఎల్ లో 2023 వన్డే వరల్డ్ కప్ హీరో ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.

New Update
SRH: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ హీరోకే కెప్టెన్ బాధ్యతలు!

Pat Cummins as SRH Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ (IPL 2024) మొదలనుండగా సన్ రైజర్స్ టీమ్ సారథ్య బాధ్యతలు వరల్డ్ కప్ హీరోకే అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్‌ (Aiden Markram) కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా ఈ టోర్నమెంట్ లో అతన్ని తొలగించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కెప్టెన్‌గా నియమించడం కోసమే..
ఈ మేరకు ఐపీఎల్‌ వేలంలో కమిన్స్‌ కోసం సన్‌రైజర్స్‌ ఏకంగా రూ.20.5 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక ధర కావడం విశేషం. అయితే ఆస్ట్రేలియాకు 2023 వన్డే వరల్డ్ కప్ (World Cup), టెస్ట్ ఛాంపియన్ షిప్ అందించిన కమ్మిన్స్ ను జట్టుకు కెప్టెన్‌గా నియమించడం కోసమే భారీ మొత్తం చెల్లించిందని సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత సీజన్‌లో మార్‌క్రమ్‌ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో పట్టికలో చివరి స్థానంలో నిలవగా ఈసారి ఎలాగైన కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది ఎస్ఆర్ హెచ్ మెనేజ్ మెంట్.

ఇది కూడా చదవండి:Sania: పురుష అహంకారులంతా ఆత్మపరిశీలన చేసుకోండి.. సానియా సంచలన వ్యాఖ్యలు!

లారా స్థానంలో డేనియల్‌ వెటోరి..
ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్‌ బ్రయాన్‌ లారా స్థానంలో డేనియల్‌ వెటోరిని (Daniel Vettori) తీసుకోగా.. ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌గా వెటోరి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కమిన్స్‌ సారథ్యంలో కంగారూ జట్టు నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలవడంతో పాటు వన్డే ప్రపంచకప్‌నూ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వెటోరి, కమిన్స్‌ కలిసి సన్‌రైజర్స్‌ కోసం పనిచేయబోతున్నారని సమాచారం. ఇక సన్‌రైజర్స్‌కు చెందిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ జట్టును వరుసగా రెండో సారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సారథిగా మార్‌క్రమ్‌ విజేతగా నిలిపాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అతనిపై వేటు పడటం ఖాయమేనని చర్చ జరుగుతోంది.

ఇటీవలే ఐపీఎల్ 2024 షెడ్యూల్ (IPL Schedule) వచ్చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ (CSK vs RCB) బెంగళూరు తలపడతాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ టోర్నీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి 15 రోజులకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు