Indigo Flight:దేశ వ్యాప్తంగా పొగమంచు చాలా ఎక్కువగా ఉంటోంది. ఢిల్లీ లాంటి ఏరియాల్లోనే కాదు...ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా దీని బాధ ఎక్కువగా ఉంది. దీంతో ఇవాళ చాలా విమానాలు కాన్సిల్ అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రయాణికులకు చాలా అసహనాన్ని గురి చేస్తోంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దాదాపు 100 విమానాలు ఆలస్యమయ్యాయి. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లో, ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకుపోయారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అయిందని ఎయిర్ హోస్టెస్ మీద దాడి చేశాడు ఒక వ్యక్తి. అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇక ఈ సంఘటన మీద విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని విజ్ఞప్తి కూడా చేశారు.
Also Read:పాత విగ్రహం కూడా కొత్త దానితో పాటూ గర్భగుడిలోనే ఉంటుంది-క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్
ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాలు ఆగి ఉండే స్థలంలో విమానం పక్కనే ప్రయాణికులు నేల మీద కూర్చుని భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీని మీద నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గోవా-ఢిల్లీ వెళ్ళే ఇండిగో విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యం అయింది. ఆ తరువాత కూడా దాన్ని ముంబైకి మళ్ళించారు. ప్యాసింజర్లు విమానం పక్కనే డిన్నర్ చేస్తున్నారు అంటూ ఓ నెటిజన్ వీడియోతో పాటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడటంతో.. ప్రయాణం ఆలస్యమవుతుందని పైలట్ ప్రకటించాడు. అయితే చివరి వరుసలో కూర్చోని ఉన్న ఓ ప్రయాణికుడు ఇది విని కోపంతో ఊగిపోయాడు. వెంటనే పైలట్ వద్దకు వచ్చి దాడి చేశాడు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రయాణికుడ్ని విమానం నుంచి దించేసి భద్రతా సిబ్బందికి అప్పగించింది.