Flight: విమానంలో ఏసీ ఆఫ్‌...సాంకేతిక లోపంతో 5 గంటల పాటు లోపలే ప్రయాణికులు.. పలువురికి తీవ్ర అస్వస్థత!

ముంబయి నుంచి మారిషస్‌ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సుమారు 5 గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అంతేకాకుండా విమానంలో ఏసీ పనిచేయక పోవడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 78 ఏళ్ల వృద్దుడు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

New Update
Flight: విమానంలో ఏసీ ఆఫ్‌...సాంకేతిక లోపంతో 5 గంటల పాటు లోపలే ప్రయాణికులు.. పలువురికి తీవ్ర అస్వస్థత!

Flight: విమానం ఇంజన్‌ (Flight Engine) లో సాంకేతిక లోపం తలెత్తడంతో పాటు ఏసీ కూడా పని చేయకపోవడంం వల్ల సుమారు 5 గంటల పాటు ప్రయాణికులు విమానంలోపలే ఉండిపోవాల్సి వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్‌ వల్ల విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో 78 ఏళ్ల వృద్దుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, కొందరు చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో ప్రయాణికులను కిందకి దించారు.

అసలేం జరిగిందంటే...

ముంబయి నుంచి మారిషస్‌ కు వెళ్లాల్సిన ఎంకే749 విమానం ముంబయి నుంచి శనివారం ఉదయం 4.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది. దీంతో ప్రయాణికులంతా తెల్లవారుజామున 3.45 గంటలకే విమానం ఎక్కారు. కానీ అందులో ఏసీలు పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారు. ఆ తరువాత విమానం ఇంజిన్‌ లో సాంకేతిక సమస్య ఏర్పడింది.

దీంతో ప్రయాణికులంతా సుమారు 5 గంటల పాటు విమానంలోనే ఉండిపోయారు. కిందకి దిగడానికి విమాన సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానంలో ఉన్న 78 ఏళ్ల వృద్దుడు , కొందరు చిన్నారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో కిందకి దిగిన ప్రయాణికులకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Also Read: కొవిడ్‌ టీకాతో రక్తం గడ్డ కడుతుంది.. బాంబు పేల్చిన సైంటిస్టులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు