Eknath Shinde: అలా చేసినందుకే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం: ఏక్‌నాథ్‌ షిండే

కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలన్న మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలపై సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు అవసరం రావడంవల్లే తన కొడుకుని ఎన్నికల బరిలోకి దింపానన్నారు. రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంతోనే ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూలదోశామన్నారు.

Eknath Shinde: అలా చేసినందుకే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం: ఏక్‌నాథ్‌ షిండే
New Update

మహారాష్ట్రలో రాజకీయాలు రాజుకున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కుటుంబ రాజకీయాలపై నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల శివసేన (UTB) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సీఎం ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తన కొడుకుని లోక్‌సభ అభ్యర్థిగా పోటీలోకి దింపడాన్ని సమర్థించుకున్నారు. అయితే తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు.. యువ నేతల అవసరం వచ్చిందని అందుకే తన కొడుకుని బరిలోకి దింపాల్సి వచ్చిందని తెలిపారు.

10 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు

శ్రీకాంత్ ఎంపీగా గెలవడంతో పార్టీలో మరింత బలం పెరిగందని అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే మాత్రం మహారాష్ట్రను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. అందుకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోశామంటూ స్పష్టం చేశారు. ఒక్కరి అహాన్ని సంతృప్తి పరిచేందుకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయడం దురదృష్టకరమంటూ షిండే అన్నారు.

కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలి

ఇదిలాఉండగా.. ఇటీవల ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ నియోజకవర్గమైన కళ్యాణ్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో కుటంబ రాజకీయాలకు ముగింపు పలకాలని అక్కడి స్థానికులను కోరారు. అసలు ఏక్‌నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్‌కు ఎంపీ టికెట్‌ ఇవ్వడమే తప్పని వ్యాఖ్యానించారు. దీంతో దీనిపై స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే.. ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలను ఎలాంటి విలువ లేదన్నారు.

ఉద్ధవ్‌ది కూడా కుటంబ రాజకీయమే

ప్రతికూల ఫలితం వస్తే వ్యవస్థలపై వ్యతిరేకంగా మాట్లాడటం ఠాక్రేకు అలవాటేనని షిండే ఆరోపణలు చేశారు. మరో విచిత్రం ఏంటంటే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబం కూడా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఉద్ధవ్ కొడుకు ఆదిత్యఠాక్రే కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

#eknath-shinde #telugu-news #uddav-takrey
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe