Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్‌ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!

లోక్‌సభ నుంచి 14మంది ఎంపీలు సస్పెండైనట్టు ముందుగా కేంద్రం ప్రకటించింది. అయితే లోక్‌సభకు అసలు హాజరుకాని డీఎంకే ఎంపీ పార్థిబన్ పేరు కూడా లిస్ట్‌లో ఉంది. దీంతో డీఎంకే ఫిర్యాదు చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం ఆయన పేరును లిస్ట్‌ నుంచి తొలగించింది.

New Update
Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్‌ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!

Lok Sabha MP Suspension : పార్లమెంట్‌(Parliament)లో భద్రతా ఉల్లంఘనపై లోక్‌సభ(Lok Sabha)లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డాయి. నిన్న(డిసెంబర్‌ 13) లోక్‌సభ సమావేశాల సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు దూకారు. బెంచీలపైకి ఎక్కి స్మోక్ గన్‌లతో పొగను వ్యాపింపజేసిన విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ ఆవరణలో మరో ఇద్దరు నిరసన చెప్పారు. వీరితో పాటు మరో వ్యక్తిని(మొత్తం ఐదుగురిని) ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్‌పై దాడిని ప్రతిపక్షాలు ఓవైపు ఖండిస్తూనే మరోవైపు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ ఘటనపై ఇప్పటివరకు ఏం మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి. లోక్‌సభలో ఇదే విషయాన్ని లేవనెత్తగా.. సభలో గందరగోళం నెలకొంది. దీంతో ముందుగా ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేసిన స్పికర్‌.. తర్వాత మరో 9మందిని... అంటే మొత్తం 14మందిని సస్పెండ్‌ చేశారు. అయితే ఈ 14మందిలో ఒక పేరును తప్పుగా ప్రకటించారని తెలుస్తోంది.


సభలోనే లేడు:
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు శీతాకాల సమావేశాల మిగిలిన కాలానికి లోక్‌సభ నుంచి సస్పెండైన 13 మంది ప్రతిపక్ష ఎంపీలలో డీఎంకే నాయకుడు ఎస్ఆర్ పార్థిబన్(SR Parthiban) పేరు కూడా ఉంది. అయితే నిజానికి ఇవాళ(డిసెంబర్ 14) సభలో ఆయన లేరే లేరు. 14మంది సస్పెండ్‌ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అది కూడా అధికారికంగానే కేంద్రం ఇలా చెప్పింది. అయితే పార్థిబన్‌ సభలో లేరన్న విషయాన్ని డీఎంకే హైలెట్ చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం మొత్తం 13 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌ ఐనట్లు తెలిపింది. లోక్‌సభ నుంచి 13మంది ఎంపీలు సస్పెండ్ చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

కేంద్రం క్లారిటీ:
సస్పెండ్ చేసిన ఎంపీలలో ఎస్‌ఆర్ పార్థిబన్ సభలో లేరని.. ఆయన చెన్నైలో ఉన్నారని అని డీఎంకే ఎంపీలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పార్థిబన్‌ 'సిక్‌ లీవ్‌'లో ఉన్నారు. ఒక ఎంపీ పేరును చేర్చడంలో పొరపాటు జరిగిందని జోషి క్లారిటీ ఇచ్చారు. తప్పుగా పెట్టిన ఎంపీ పేరును తొలగించాలని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామన.. స్పీకర్‌ అందకు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఓవరాల్‌గా సస్పెండైన ఎంపీల సంఖ్య 14. 13 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ సస్పెండ్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ నుంచి మిగిలిన సెషన్లకు సభ చైర్మన్‌ సస్పెండ్ చేశారు. ఇక సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల్లో డీన్ కురియాకోస్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, బెన్నీ బెహనన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి కరుణానిధి, కే సుబ్బరాయన్, ఎస్ ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్‌ ఉన్నారు.

Also Read: పార్లమెంట్‌పై దాడి చేసిన వారి బతుకులు జైల్లోనే.. ‘ఊపా’తో పాటు మొత్తం పెట్టిన సెక్షన్ల లిస్ట్ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు