Paris Olympics 2024 : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు!

పారిస్ ఒలింపిక్స్ లో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ పై అనర్హత వేటు పడింది. ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున పోటీనుంచి తప్పించారు. దీంతో పతకం ఆశలు ఆవిరైపోయాయి.

Paris Olympics 2024 : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు!
New Update

Bad News To Indians : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ (Vinesh Phogat) పై అనర్హత వేటు పడింది. ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున అనర్హత వేటు వేశారు.

ఈ మేరకు బుధవారం ఫైనల్ పోరు జరగనుండగా భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇంకా పోడియంకు చేరుకోలేకపోయింది. ఆమె 50 కిలోల గోల్డ్ మెడల్ ఫైట్ కు ఉండాల్సిన వెయిట్ కంటే దాదాపు 100 గ్రాములు ఎక్కువగా బరువు ఉన్నారని, ఇది ఆమె అనర్హతకు దారితీసిందని నిర్వాహకులు వెల్లడించాయి. పోటీ నిబంధనల ప్రకారం ఫోగాట్ రజత పతకానికి కూడా అర్హత పొందదు. 50 కిలోల బరువు కేవలం బంగారు, కాంస్య పతక విజేతలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అయితే వినేశ్ అనర్హత వేటువేయడంపై క్రీడాభిమానులు ఒలింపిక్స్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. కావాలనే కక్షతో ఇలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫొగట్ టార్గెట్ గా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వ క్రీడాల్లో పాల్గొనే వారికి శరీరంపై సోయి లేదా అంటూ తిట్టిపోస్తున్నరు. ఈ క్రమంలో స్పందించిన భారత ఒలింపిక్ సంఘం.. ‘వినేశ్‌ ఫొగాట్‌ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు అత్యంత బాధాకరం’ అంటూ విజ్ఞప్తి చేశారు.

Also Read : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం?

#paris-olympics-2024 #vinesh-phogat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe