Coronavirus: ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 40 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డట్లు నిర్వాహకులు వెల్లడించారు. పలువురు ఆటగాళ్లకు సైతం పాజిటివ్ రావడంతో పోటీనుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది.

New Update
Coronavirus: ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

Paris Olympics: మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రపంచ నలుమూలనుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ -19 టెస్టులు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో దాదాపు 40 మందికి పైగా పాజిటివ్‌గా రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కోవిడ్ -19 వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతోందని, దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే వైరస్ - SARS-CoV-2 పరీక్షల శాతం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

అయితే ఉన్నత స్థాయి అథ్లెట్లు ఈ కోవిడ్-19 బారిన పడ్డట్లు నిర్వాహకులు గుర్తించారు. బ్రిటీష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజతం గెలిచిన ఒక రోజు తర్వాత కోవిడ్ బారిన పడ్డారు. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిని లాని పల్లీస్టర్ అనారోగ్యంతో తప్పుకుంది.

Advertisment
తాజా కథనాలు