Paris Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ టీమ్.. గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం!

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల టీమ్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శన చేశాడు.

Paris Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ టీమ్.. గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం!
New Update

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల టీమ్ దూకుడు కొనసాగిస్తోంది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 1 (4)- 1 (2) తేడాతో విజయం సాధించింది. తొలుత మ్యాచ్‌ 1-1తో టై అవగా.. షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపుతీరాలకు చేరింది.

మొదటినుంచి రసతవత్తరంగా సాగిన మ్యాచ్‌లో తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌కార్డ్ ద్వారా బయటికి పంపారు. దీంతో తర్వాత భారత్ 10 మందితోనే ఆడింది. 22వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్ పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్‌ చేయడంతో స్కోర్ లెవల్ అయిది. ఈ క్రమంలో రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇండయా టీమ్ షూటౌట్‌లో 4-2తో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

#paris-olympics #semi-finals #indian-mens-hockey
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe