Paris Olympics 2024: ఆర్చరీ మిక్స్‌డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్! పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత జోడీ దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర - అంకితా భకత్ జోడీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 5-3 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించింది. By srinivas 02 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Dheeraj Bommadevara and Ankita Bhakat: పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత జోడీ దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర - అంకితా భకత్ జోడీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 5-3 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించింది. దీంతో ధీరజ్ బొమ్మదేవర- అంకిత భకత్ పారిస్ ఒలింపిక్స్ 2024లో విలువిద్యలో భారత్‌కు బంగారు లేదా రజత పతకాన్ని సాధించేందుకు కేవలం గెలుపు దూరంలో ఉన్నారు. కొరియా vs ఇటలీ మ్యాచ్‌లో విజేతతో తదుపరి పోరులో ఈ జోడీ తలపడనుంది. అంతకు ముందు తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్‌తో కలిసి క్వార్టర్స్ పోరు సులభంగా నెగ్గారు. ఇండోనేషియా ద్వయం ఆరిఫ్-కోరునిసాపై 5-1తో విజయం సాధించారు. సింగిల్ విభాగంలో ధీరజ్ త్రుటిలో పోటీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. Also Read: 25 మీటర్ల పోటీలో ఫైనల్‌కు చేరిన మనుబాకర్! #paris-olympics-2024 #india-at-olympics #mixed-team-archery #dhiraj-bommadevara-and-ankita-bhakat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి