Manu Bhaker: మరొక్క అడుగు.. 25 మీటర్ల పోటీలో ఫైనల్‌కు చేరిన మనుబాకర్!

భారత యువ షూటర్‌ మను బాకర్‌ మరో చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్వాలిఫికేషన్‌ పోరులో మొత్తంగా 590 పాయింట్లు సాధించింది.

New Update
Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్‌‌

Manu Bhaker in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్‌ మను బాకర్‌ దూసుకెళ్తుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన మను మరో చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి ప్రిసిషన్‌ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్‌ 3లో నిలిచిన మను.. ఆ తర్వాత ర్యాపిడ్‌ రౌండ్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లిన మనుబాకర్.. శనివారం జరిగే ఫైనల్‌ పోటీలో పతకం సాధిస్తే ఈ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలతో భారత ఒలింపిక్‌ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. ఇక ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్‌ ఇషా సింగ్‌ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

Also Read: ఆర్చరీ మిక్స్‌డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్!

Advertisment
తాజా కథనాలు