Olympics 2024 : గురి చూసి కొడితే గోల్డ్ వచ్చి పడాల్సిందే..!

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 లో భారత్‌ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మెడల్‌ ఈవెంట్‌ ఉంది.

Olympics 2024 : గురి చూసి కొడితే గోల్డ్ వచ్చి పడాల్సిందే..!
New Update

Paris Olympics 2024 : పారిస్‌ ఓలింపిక్స్‌ వేదిక సిద్ధమైంది. ప్రపంచ క్రీడాకారులు తమ శక్తిని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు తొలి పతకం అందించే బాధ్యత షూటర్లపైనే (India Shooters) ఉంది. ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత షూటర్లు పతకాలు సాధించి 12 ఏళ్ళు కావస్తోంది. ఒలింపిక్స్‌లో చివరిసారి 2012 గగన్‌ నారంగ్‌ (Gagan Narang) పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించగా.. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో విజయ్‌ కుమార్‌ రజత పతకం గెలిచాడు.

అప్పటి నుంచి ఇప్పటిదాకా భారత షూటర్లకు ఒక్క మెడల్ కూడా రాలేదు.ఇక ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మెడల్‌ ఈవెంట్‌ ఉంది.

Also Read : ఒలింపిక్స్‌కు ప్రత్యేకమైన గూగుల్ డూడుల్

ఈ విభాగంలో భారత్‌ నుంచి అర్జున్‌ బబూటా–రమితా జిందాల్‌ జోడీ (Ramita Jindal-Arjun Babuta), సందీప్‌ సింగ్‌–ఇలవేనిల్‌ వలారివన్‌ జోడీ (Sandeep Singh - Elavenil Valarivan పోటీపడతాయి. ఓవరాల్‌గా 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. క్వాలిఫయింగ్‌ ముగిశాక టాప్‌–4లో నిలిచిన జోడీలు మెడల్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. టాప్‌–2లో నిలిచిన జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం, మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.

#paris-olympics-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe