Parineeti Chopra : ఆ హీరో ప్యాంట్ లేకుండానే నా పక్కన వచ్చి కూర్చుంటాడు.. బాలీవుడ్ స్టార్ పై పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి చోప్రా రన్ వీర్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రన్ వీర్ సెట్స్ లో బట్టలు లేకుండా ఉంటాడని, ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడని చెప్పింది.

Parineeti Chopra : ఆ హీరో ప్యాంట్ లేకుండానే నా పక్కన వచ్చి కూర్చుంటాడు.. బాలీవుడ్ స్టార్ పై పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్!
New Update

Parineeti Chopra Shocking Comments On Ranveer Singh : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత 'చంకీలా' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి బాలీవుడ్ స్టార్ రన్ వీర్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ మధ్య రన్ వీర్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అది కేవలం మ్యాగజైన్ కోసమే అయ్యుంటుందిలే అని అనుకున్నారంతా. కానీ రన్ వీర్ సెట్స్ లో కూడా బట్టలు లేకుండా ఉంటాడని షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ప్యాంట్ లేకుండానే పక్కన కూర్చుంటాడు

తాజా ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ.. " రన్ వీర్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి తను చేస్తున్న పనులకు నేను కూడా బాగా అలవాటు పడిపోయా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్‌ దుస్తులతో వచ్చి ఈరోజు ఇదే లుక్‌ అంటాడు. ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. అని చెప్పింది.

మేకప్ వ్యాన్ లో బట్టలు లేకుండా

" మాములుగా నేను అందరి మేకప్ వ్యాన్స్ లోకి వెళ్తుంటాను. కానీ రన్ వీర్ మేకప్ వ్యాన్ లోకి వెళ్ళడానికి కాస్త ఆలోచించి అతని పర్మిషన్ తీసుకొని వెళ్తాను. బట్టలు వేసుకున్నాడో లేదా అని తెలుసుకుని వెళ్తాను. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ, బట్టలు లేకుండా ఎదురుగానే నిలబడి ఉంటాడు. కానీ, అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు. అలాగే సమాధానం ఇస్తాడు' అంటూ సెట్స్ లో అనుభవాలను పంచుకుంది. దీంతో రన్ వీర్ పై పరిణీతి చోప్రా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#ranveer-singh #parineeti-chopra
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe