Parineeti Chopra: అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది.. ఆప్ ఎంపీ భార్య బోల్డ్ కామెంట్! ఈ రోజుల్లో సాహసం చేస్తేనే నటీనటులకు ఎక్కువ గుర్తింపు వస్తుందని నటి పరిణీతి చోప్రా చెప్పింది. అందుకే తాను ‘అమర్ సింగ్ చంకీల’ మూవీ కోసం 16 కిలోల బరువు పెరిగినట్లు తెలిపింది. ఎవరైనా రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అవుతారంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. By srinivas 26 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Amar singh chamkila: ఇటీవల 16 కిలోలు బరువు పెరగడంపై బాలీవుడ్ నటి, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా భార్య పరిణీతి చోప్రా ఓపెన్ అయింది. ఇటీవల విడుదలై బిగ్ హిట్ సొంతం చేసుకున్న ‘అమర్ సింగ్ చంకీల’ సినిమా కోసం తాను చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పింది. సక్సెస్ మీట్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంపిక చేసుకోవడంతో ఫెయిల్ అయ్యానని చెప్పింది. From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs! Couldn’t have lived without each other .. Our forever begins now .. 💖 pic.twitter.com/M1xQ8BIHLt — Parineeti Chopra (@ParineetiChopra) September 25, 2023 అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు.. 'ఫ్యాన్స్ నా నుంచి మంచి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. దానికోసం హోం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నా. సవాళ్లతో కూడిన కథలను ఎంచుకోవడం ప్రారంభించాను. అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. ‘అమర్ సింగ్ చంకీల’ కోసం నేను 16 కిలోల బరువు పెరిగాను. ఎంతమంది ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారు? ఇలాంటి సాహసం తక్కువమంది హీరోయిన్లు చేస్తారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒకరో, ఇద్దరో దీనికి అంగీకరిస్తారు. అంకితభావం, నిబద్ధత కలిగిన హీరోయిన్లు మాత్రమే ఇలా చేయగలరు. ఈ సినిమా నాకు అసాధారణ ప్రయాణం. లైవ్‌లో ఎలా పాడాలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. రిస్క్ తీసుకున్నాను కాబట్టే చిత్రం విజయం సాధించింది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది. #parineeti-chopra #amar-singh-chamkila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి