ఛీ.. మరీ ఇంత దారుణమా.. మళ్లీ రిపీటైతే ఊరుకోను: పరిణీతి ఫైర్

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తనపై నెట్టింట జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి కొన్ని ఫ్యాన్‌ క్లబ్స్‌ తన పేరును ఉపయోగించుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

New Update
ఛీ.. మరీ ఇంత దారుణమా.. మళ్లీ రిపీటైతే ఊరుకోను: పరిణీతి ఫైర్

బాలీవుడ్ నటి, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సతీమణి పరిణీతి చోప్రా తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగెటీవ్ ప్రచారంపై స్పందించారు. నెట్టింట ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే పరిణీతి ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన ఫ్యాషన్, పలు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ మురిసిపోతుంది. ఈ క్రమంలోనే మిగతా నటుల్లాగే పలుసార్లు ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. అయితే రీసెంట్ గా ఫ్యాన్‌ క్లబ్స్‌, ఫ్యాన్‌ పేజీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగించుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల కొంతమంది ఫాలోవర్స్ తన ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ తన గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఇతరుల గురించి పరిణీతి షాకింగ్ కామెంట్స్ చేసినట్లు క్రియేట్ చేసి బురదజల్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన నటి.. ‘నా పేరు ఉపయోగించి కొన్ని ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటీనటులకు ఫేవర్‌గా పోస్టులు క్రియేట్‌ చేస్తున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటివి రిపీటైతే ఊరుకోను. సదరు వ్యక్తులపై రిపోర్ట్‌ చేస్తా. మీరు ఏదైనా పోస్టు చేసేముందు నిజానిజాలు తెలుసుకోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇకపై నా గురించి ఇలాంటి రిపీట్ కావొద్దు. అభిమానులు కూడా నేను స్వయంగా అధికారిక ప్రకటన చేయని వార్తలను నమ్మొద్దు' అని కోరారు.

Also read :నేను ఆ రోజే చనిపోతానని ఫిక్స్ అయ్యాను.. కానీ లక్కీగా బతికిపోయా

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో పరిణీతి కొంతకాలం ప్రేమలో ఉండగా.. 2023 సెప్టెంబర్ 24న వీరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం పరిణీతి భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న పరిణీతి ఇటీవలే తాము జరుపుకున్న తొలి పండుగ కర్వా చౌత్ ఫొటోలు షేర్ చేసి మురిసిపోయింది.

Advertisment
తాజా కథనాలు