/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Leave-these-things-after-marriage.otherwise-there-will-be-trouble-4-1-jpg.webp)
Parents With Children: తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల మంచిని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండా చేసే తప్పులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తమ బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, జీవితంలో ముందుకు సాగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ చాలా సార్లు ఆలోచించకుండా పిల్లల హృదయం, మనస్సుపై చెడు ప్రభావం చూపే పనిని చేస్తాం. ఈ తప్పులు జీవితాతం పశ్చాత్తాపపడేలా చేస్తాయి. అందుకే పిల్లలను ప్రభావితం చేసే తప్పులను ఎప్పుడూ చేయకుండా చూసుకోవాలి.
ఒత్తిడి చేయవద్దు:
చదువులో లేదా ఏదైనా విషయంలో అత్యుత్తమంగా ఉండాలని పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదు. అందుకంటే వారి మానసిక స్థితిపై ప్రభావం పడటమే కాకుండా ఆనందంగా ఉండలేరు.
పోలిక:
మన బిడ్డను ఇతరులతో పోల్చినప్పుడు అది వారిని నిరుత్సాహపరుస్తుంది. అంతేకాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల వాళ్లు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. సొంత సామర్థ్యాలను అనుమానించడం మొదలుపెడతారు. అందుకే పిల్లల్లో నైపుణ్యం గుర్తించి అభినందించాలి. ఇతరులతో అస్సలు పోల్చకూడదు.
పిల్లలు చెప్పింది వినాలి:
పిల్లల భావాలు, చెప్పే మాటలకు తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి. లేకుంటే పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు. విజయం సాధించలేరు. అందుకే పిల్లల ఇష్టాఇష్టాలను అర్థం చేసుకోవాలి. వాళ్లు చెప్పేది విని, ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ శ్రద్ధ వద్దు:
పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపించడం కూడా కొన్నిసార్లు పనికిరాదు. వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. నిర్ణయాలు కూడా స్వయంగా తీసుకునేలా వారిని తయారు చేయాలి. పదేపదే అడ్డుకుని శ్రద్ధ చూపించడం వల్ల వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎదగాలనే కోరికను పక్కన పెడతారు.
కమ్యూనికేషన్:
మనం పిల్లలతో మాట్లాడనప్పుడు వారు ఒంటరిగా ఫీల్ అవుతారు. దీనివల్ల మనం వారి భావాలను అర్థం చేసుకోలేమని లేదా పట్టించుకోవడం లేదని వారు భావించవచ్చు. అందుకే పిల్లలతో మాట్లాడటం, వారి మాటలు వినడం, కలిసి ఎక్కువ సమయం గడపడం చేస్తుండాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లైన తర్వాత ఈ విషయాలు వదిలేయండి..లేకుంటే కష్టాలు తప్పవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.