Parenting: పొరపాటున కూడా పిల్లల ముందు ఈ పనులు చేయకండి!

మీ పిల్లలను ఇతరలతో పోల్చవద్దు.ఇలా చేస్తే పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. పిల్లలతో గట్టిగా మాట్లాడకూడదు. పిల్లల ప్రవర్తన, జీవనం, ఆహారపు అలవాట్ల గురించి జోక్ చేయకూడదు. లావు, సన్నం, ఎత్తు, పొట్టి లాంటి పదాలు పిల్లల దగ్గర ఉపయోగించకూడదు.

New Update
Parenting: పొరపాటున కూడా పిల్లల ముందు ఈ పనులు చేయకండి!

Parenting Tips: పదేపదే జోకులు వేయడం, తిట్టడం లేదా తప్పుడు పోలికలు పిల్లలపై నెగిటివ్‌ ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు తల్లిదండ్రుల నుంచి జీవిత తత్వాన్ని నేర్చుకుంటూ ఎదుగుతారు. బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు ఇంట్లోనే తొలి విద్యను అభ్యసిస్తారు. ఒకవేళ తల్లిదండ్రుల మంచిగా ఉండకపోతే అది జీవితాంతం వారి మనస్సులో తిష్టవేసుకోని ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని విషయాలు చెబుతారు. వాటి నుంచి వారు ప్రపంచం గురించి ఒకే విధమైన అవగాహన లేదా దృక్పథాన్ని ఏర్పరుస్తారు. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, జీవనం, ఆహారపు అలవాట్ల గురించి జోక్ చేస్తారు. ఇవి విషయాలు పిల్లల ప్రవర్తనలో భాగం అవుతాయి. అందుకే తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేయవద్దు.

--> కొడుకు ఏడుస్తుంటే ఆ తల్లి అమ్మాయిలలా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలా అనకూడదు. ఏడుపు అన్నది ఒక ఎమోషన్ మాత్రమే. అమ్మాయిలు మాత్రమే ఏడవాలని లేదు. ఇలాంటి కామెంట్స్ పిల్లావాడిలో అమ్మాయిల పట్ల నెగిటివ్‌ ఫీలింగ్‌ను కలిగేలా చేస్తుంది. మగవాడినన్న అహంకారం పెరిగేలా చేస్తుంది.

--> పిల్లలను టీ తాగకుండా తల్లి విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. టీ తాగితే నలుపు రంగు వస్తుందని, పాలు తాగితే తెల్లగా మారుతుందని చెబుతుంటారు. పాలు లేదా టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చెప్పడానికి బదులుగా ఇలాంటి మాటలు చెబితే వారిలో వర్ణవివక్ష భావన పెరుగుతుంది.

--> చెవులు మిరపకాయలా ఎర్రగా మారాయని చాలా మంది తల్లిదండ్రుల నోటి నుంచి మీరు వినే ఉంటారు. బిడ్డకు కోపం వచ్చినప్పుడు చెవులు మిరపకాయలా ఎర్రగా మారాయని తల్లి చెబుతుంది. అంటే కోపాన్ని మిరపకాయలతో పోల్చుతున్నారు. ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. శరీరాన్ని వివిధ పండ్లతో, కూరగాయాలతో, మిరపకాయలతో పోల్చడం మంచి పద్ధతి కాదు.

--> తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లకు నిరంతరం అంతరాయం కలిగిస్తారు. వారి శరీర ఆకృతిపై వ్యాఖ్యానిస్తారు. మీ ఈ అలవాటుతో, పిల్లవాడు తన లుక్ గురించి అభద్రతా భావానికి లోనవుతాడు. ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. కాబట్టి పిల్లలు ఎలా ఉన్నా వారి బాడీ ఇమేజ్ గురించి కామెంట్ చేయకండి.

--> ఇతరులతో మీ పిల్లాడిని పోల్చడం అసలు చేయకండి. అలా చేస్తే వారి ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది.

Also Read: ట్రోలింగ్ కిల్లింగ్..సైకోలుగా మారుతున్న సోషల్ మీడియా ఎడిక్ట్స్!

Advertisment
తాజా కథనాలు