Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం!

పారాలింపిక్స్‌లో భారత్‌ కు మరో పతకం లభించింది. పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 8కి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ యోగేశ్ రజతం దక్కించుకున్నాడు.

New Update
Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం!

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 7 పతకాలు సాధించిన భారత్ కు మరో పతకం సాధించింది. ఈ మేరకు పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా (46.86 మీ) స్వర్ణం అందుకుగా.. యోగేశ్ కతునియా (42.22 మీటర్లు) విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 8కి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు. భారత ఆటగాళ్లపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా వారిని పొగుడుతూ పోస్ట్ పెట్టారు.

Advertisment