Papaya Benefits: బొప్పాయి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అయితే ఇందులో 200 శాతం వరకు విటమిన్ ఎ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పోషణ నిపుణుల ప్రకారం బొప్పాయి ఐదు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుందని చెబుతున్నారు. బొప్పాయిని ఎలా తినాలో చాలా మందికి తెలియదు. అన్ని రోగాలు కడుపు నుంచే ప్రారంభమవుతాయి. ఎప్పుడూ కడుపు నొప్పిగా ఉండే వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపు చాలా కష్టపడాలి. అది సరిగ్గా పనిచేయకపోతే వివిధ రకాల వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి ఉన్నవారికి బొప్పాయి ఔషధం లాంటిది. ఇందులో శక్తివంతమైన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లతోపాటు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఏ సమయంలో తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
విటమిన్-సి పుష్కలం:
- న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం..బొప్పాయి తినడం వల్ల 200% విటమిన్ సి లభిస్తుందని చెబుతున్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు అంటున్నారు.
బొప్పాయి తింటే లాభాలు:
- బొప్పాయి తింటే పీరియడ్స్ నొప్పి తగ్గింపు, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ నుంచి విముక్తి లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, 200 శాతం విటమిన్ సి, మోటిమలు, చుండ్రు వంటి సమస్యలకు బొప్పాయి ఏంతో మేలు చేస్తుంది.
సరైన సమయం:
- పండ్లను రాత్రి మినహా ఏ సమయంలోనైనా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ బొప్పాయిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంలో తినడం మంచిదని భావిస్తారు. అల్పాహారంలో కూడా బొప్పాయి రసం తాగవచ్చు. బొప్పాయిని ఇతర పండ్లతో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: శృంగారంలో రెచ్చిపోవాలనుందా..అయితే ఇవి తినండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ప్రపోజ్ డే స్పెషాలిటీ ఏంటి?