IMD: ఇకనుంచి గ్రామాల్లో కూడా వాతావరణ సమాచారం.. వచ్చే వారం నుంచే అమలు..

దేశంలో ఇకనుంచి గ్రామీణ స్థాయిలో వాతవారణం అంచనా వేసే సదుపాయం రానుందని ఐఎండీ విభాగం డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వచ్చేవారం నుంచి గ్రామపంచాయతీ స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

New Update
IMD: ఇకనుంచి గ్రామాల్లో కూడా వాతావరణ సమాచారం.. వచ్చే వారం నుంచే అమలు..

ఇప్పటివరకు మండలాలు, జిల్లాలు, నగరాల్లో మాత్రమే వాతావరణాన్ని అంచనా వేసే సౌకర్యం ఉండేది. అయితే ఇకనుంచి గ్రామీణ స్థాయిలో కూడా వాతవారణం అంచనా వేసే సదుపాయం రానుంది. వచ్చేవారం నుంచి గ్రామపంచాయతీ స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని ఆ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం పీటీఐ వార్త సంస్థతో తెలిపారు.

వాతావరణ నష్టాల నుంచి చిన్న రైతులను ఆదుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. వాతావరణ సూచనలను మండలాల నుంచి గ్రామాల స్థాయి వరకు తీసుకెళ్లడం సాధ్యమైందని చెప్పారు. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలోని ప్రతిగ్రామంలో కనీసం అయిదుగురు రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యమని చెప్పారు. తీవ్రమైన వాతావరణ హచ్చరికలు, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలుల వేగం, తేమశాతం లాంటి అన్ని వివరాలను కూడా పంచాయతి వాతావరణ సేవ ద్వారా పొందవచ్చని తెలిపారు. ప్రాంతం పేరు, పిన్‌కోడ్‌, లేదా అక్షాంశ రేఖాంశాలను తెలిపి సులభంగా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

Also Read: ‘కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి’ ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు..

ఏడాది పాటు జరగనున్న ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 'ప్రతిచోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం' అనే పేరుతో ఈ కొత్త సేవను అదేరోజు మొదలుపెట్టనున్నామని చెప్పారు. ఎవరైనా కూడా దేశంలో ఎక్కడి నుంచైమా మొబైల్‌ యాప్‌ నుంచి వారం రోజుల వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

వాతావరణ సమాచారాన్ని వాడుకొని.. దానికి అనుగూణంగా స్పందిస్తే వర్షధార ప్రాంతాల్లో ఉండే చిన్న రైతలు రూ.12,500 వరకు లబ్ధి పొందవచ్చని మృత్యుంజయ తెలిపారు. ఇప్పటిదాకా తాము 3 కోట్ల మంది రైతులకు చేరువయ్యామని.. వాళ్లందరికీ రూ.13,300 కోట్ల వరకు లబ్ధి జరిగనట్లు చెప్పారు. ఇక దేశంలో 10 కోట్ల మంది రైతులు ఈ సేవలను వినియోగించుకుంటే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కూడా పెరుగుతుందని అన్నారు. ఏవైన నిర్మాణ పనులు ప్రారంభించుకునే ముందు.. అలాగే పెళ్లిళ్లు చేసేముందు కూడా ప్రజలు వాతావరణ వివరాలు వినియోగించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని

Advertisment
తాజా కథనాలు