Telangana: దసరా తర్వాత షురూ.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు

రానున్న నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

New Update
Telangana: దసరా తర్వాత షురూ.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన గురువారం కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని.. సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితా వెలువరిస్తామని పేర్కొన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో అన్ని పంచాయతీతో పాటు అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు ప్రకటన చేశారు.

Also Read: మహిళలపై అఘాయిత్యాలు.. రాబర్ట్‌ వాద్రా కీలక వ్యాఖ్యలు

తొలుత మూడు దశల్లో పంచయాతీ ఎన్నికలు నిర్వహిస్తామని.. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు, ఇక చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డు పరిధిలో ఓటు హక్క ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Also Read: రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు

Advertisment
తాజా కథనాలు