Tomb: పనామాలో బయటపడ్డ 1200 ఏళ్ల నాటి సమాది.. భారీ బంగారు నిధి!

దక్షిణ అమెరికాలోని పనామా పురావస్తు శాస్త్రవేత్తలు బంగారు నిధి, బలి అవశేషాలతో నిండిన 1,200 ఏళ్ల పురాతన సమాధిని గుర్తించారు. విలువైన వస్తువులతోపాటు 32 మృతదేహాల అవశేషాలు బయటపడ్డట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.

New Update
Tomb: పనామాలో బయటపడ్డ 1200 ఏళ్ల నాటి సమాది.. భారీ బంగారు నిధి!

America: దక్షిణ అమెరికాకు చెందిన పనామాలో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 12 శతాబ్దాల కిందటి సమాధిని తవ్వుతుండగా బటయపడ్డ భారీ బంగారం, విలువైన వస్తువులు పరిశోధకులను ఆశ్యర్యానికి గురిచేశాయి. ఎల్‌కానో ఆర్కియాలాజికల్‌ పార్క్‌ దగ్గర తవ్వకాలు నిర్వహించగా ఈ నిధిని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో చాలా మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయని, అమెరికాలో యూరోపియన్‌ రాకకు ముందు నివసించిన తెగల జీవితాలను గురించి తెలియజేస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: MLC Kavitha: ఇది చాలా దౌర్భాగ్యం.. రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి!

తిమిగలం పళ్లు..
ఈ మేరకు సమాధి తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జూలియా మాయో మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ సమాధి చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుంది. ఇందులో బంగారు శాలువా, ఆభరణాలు, బెల్టులు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువులున్నాయి. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించాం. ఈ సమాధి కోకల్‌ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి' అని చెప్పారు. అలాగే సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్‌ మెంటోనెగ్రో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు