Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..!

ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.అధికారులు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ నేను వెళ్లలేదు..నాకు తెలియదు..అని మాత్రమే చెప్పారు.

New Update
Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..!

YCP Leader Pinnelli Ramakrishna Reddy EVM Break Case : ఏపీ (Andhra Pradesh) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (General Elections) సమయంలో పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌ లో ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.

నెల్లూరు (Nellore) జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు జరిగింది. అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగితే వాటిలో 30 ప్రశ్నలకు నేను వెళ్లలేదని, వారెవరూ తనకు తెలియదనే సమాధానం మాత్రమే చెప్పినట్టు తెలుస్తుంది.

పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎంను పగలగొట్టలేదని, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆ రోజు తన వెంట గన్‌మెన్లు లేరని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. కాగా, కారంపూడి అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించిన కేసులో మంగళవారం పిన్నెల్లిని అధికారులు మరోసారి విచారించనున్నారు.

Also read: రాయ్‌గఢ్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు

Advertisment
Advertisment
తాజా కథనాలు