Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఈ పాత వీడియో మీకు గుర్తుందా.. బిగ్ బాస్ తర్వాత మరో సారి ట్రెండింగ్! కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ విజేతగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ షోకు ముందు ప్రశాంత్ యు ట్యూబ్ లో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ కు సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట్లో వైరలవుతుంది. వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి. By Archana 24 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pallavi Prashanth : రైతు బిడ్డగా బిగ్ బాస్(Bigg Boss 7) లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) సీజన్ 7 విజేతగా గెలిచి బిగ్ బాస్ చరిత్రలో సంచలనం సృష్టించాడు. బిగ్ బాస్ షోకు ముందు ప్రశాంత్ తన యుట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. దాంట్లో తన ఊరుకు, వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఆ తర్వాత సీజన్ 4 నుంచి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్లాలనే కోరికను బలంగా ఏర్పరచుకున్నాడు. బిగ్ బాస్ కు వెళ్లాలనే తన కోరికను ఎన్నో వీడియోస్ రూపంలో చెప్తూ వచ్చాడు. చివరికి బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ వచ్చిన మొదట్లో.. రెండు వారల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అనే భావన ప్రేక్షకులలో కలిగింది. కానీ ఆ తర్వాత ఆటలో తనకున్న పోటీతత్త్వం, గెలవాలనే పట్టుదల, రైతుగా సాటి రైతుకు సాయం చేయాలనుకునే మనస్తత్వం ప్రశాంత్ ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు. ప్రేక్షకుల అభిమానమే ప్రశాంత్ ను బిగ్ బాస్ సీజన్ 7 విజేతను చేసింది. జరిగిన 6 సీజన్స్ లో సెలెబ్రెటీలే టైటిల్ గెలిచారు.. మొదటి ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ గెలిచి ఎంతో మంది సామాన్యులకు ఆదర్శం అయ్యారని ప్రేక్షకులు హర్షం తెలియజేస్తున్నారు. ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాక ప్రేక్షకులు తన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లోని ప్రశాంత్ పాత వీడియోలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ పొలంలో కూర్చొని అన్నం తింటున్న రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ విన్నర్" అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Salaar Movie: థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో నిలిపివేత.. రచ్చ చేసిన ప్రేక్షకులు #bigg-boss-season-7-telugu-winner #bigg-boss-pallavi-prashanth #bigg-boss-7-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి