Salaar Movie: థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో నిలిపివేత.. రచ్చ చేసిన ప్రేక్షకులు

'సలార్' నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. కానీ తాజాగా హైదరాబాద్ లోని మల్లిఖార్జున థియేటర్ లో నిర్వాహకులు సలార్ ప్రీమియర్ షోను నిలిపివేశారు. థియేటర్ లోకి ఎక్కువ మంది జనం రావడంతో షో ఆపేసినట్లు తెలిసింది.

New Update
Salaar Movie: థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో నిలిపివేత.. రచ్చ చేసిన ప్రేక్షకులు

Salaar Movie: స్టార్ హీరోల సినిమా విడుదల అని తెలియగానే వారం రోజుల ముందు నుంచే టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు అభిమానులు. అందులో ముఖ్యంగా ప్రభాస్ సినిమా అంటే ఇంక ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందే అనుకుంటారు. ఇక సలార్ విషయంలో అదే జరిగింది. సలార్ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సినిమా పై సూపర్ హిట్ టాక్ మొదలైంది. కానీ తాజాగా హైదరాబాద్ లోని మల్లిఖార్జున థియేటర్ లో నిర్వాహకులు సలార్ ప్రీమియర్ షోను నిలిపివేశారు. థియేటర్ లోకి అధిక జనం రావడంతో నిర్వాహకులు షో వేయనట్లు తెలిసింది. షో ఆపేయడంతో థియేటర్ లోని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ లో రద్దీని కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కిన 'సలార్'. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ప్రభాస్ అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. బాహుబలి తర్వాత 'సలార్' తో ప్రభాస్ మరో సారి రికార్డుల సృష్టించనున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. కేజీఎఫ్ సినిమా రికార్డులను మించి సలార్ ఉండబోతున్నట్లు ప్రేక్షకుల అంచనాలు. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్  ప్రభాస్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అందించారు.

Also Read: Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు