Telangana Elections: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జై కేసీఆర్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా కేసీఆర్‌కు జై కొట్టాల్సిందేనంటున్నారు.

New Update
Telangana Elections: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో దుమ్మురేపుతున్న నేతలు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు. మీరేం చేశారు? అంటే మీరేం చేశారు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా నేతల ప్రచారాలకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు.. పార్టీల ప్రచారానికి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి.

అయితే, పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను, తెలంగాణ ఓటర్లను బాగా ఆకర్షిస్తోంది. ఆమె ఏ సందర్భంలో అన్నారో తెలియదు గానీ.. ప్రత్యర్థి పార్టీ అధినేతకు జై కొట్టారు. అదేనండీ.. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు జై కొట్టారు. ప్రచారం ముగింపు సందర్భంగా జై కాంగ్రెస్ అనాల్సిన ఆమె.. జై కేసీఆర్ అంటూ గట్టిగా నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత చిన్న వియస్కురాలైన యశస్విని.. కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఒకసారి ఎంపీగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అజేయంగా నిలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావుకే సవాల్ విసురుతున్నారు యశస్విని. ఈసారి ఎర్రబెల్లి ఖేల్ ఖతం అంటూ విశ్వాసంతో చెబుతున్నారు. ఆ రేంజ్‌లోనే తన ప్రచారాన్ని కూడా సాగిస్తున్నారు. ఇంత జోష్‌లో ఉన్న యశస్విని.. ఓ చోట ప్రచారాన్ని ముగిస్తూ జై కేసీఆర్ అని నినదించడం వైరల్‌గా మారింది.

ఇక వీడియోను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా సరే కేసీఆర్‌కు జై కొట్టాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు