ODI World Cup 2023: ప్రాక్టిస్ మ్యాచ్‌లో దుమ్ము రేపిన పాకిస్థాన్ ప్రాక్టిస్ మ్యాచ్‌లో దాయది దేశం పాకిస్థాన్ దుమ్మురేపింది. కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగడంతో ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణిత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. By Karthik 29 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రాక్టీస్ మ్యాచ్‌లో దాయది దేశం పాకిస్థాన్ దుమ్మురేపింది. కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగడంతో ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణిత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజామ్ 80 పరుగులతో అదరగొట్టాడు. ఆరంభంలో బాబర్, రిజ్వాన్ దాటిగా ఆడగా.. చివర్లో సౌద్ షకీల్ 53 పరుగులతో చెలరేగడంతో పాక్ నిర్ణిత ఓవర్లలో 345 పరుగులు భారీ స్కోర్ సాధించింది. మరోవైపు కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకన్నారు. కివీస్ ఫీల్డర్ల మిస్ ఫీల్డ్ వల్ల పాకిస్థాన్ టీమ్ భారీ స్కోర్ సాధించిందనే చెప్పాలి. కివీస్ ఫీల్డర్లు, బౌండరీల వద్ద బంతులను వదిలేయగా.. పలుమార్లు పాక్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌ను సైతం వదిలేశారు. కాగా వర్డల్ కప్ అసలు సమరానికి ముందు పాకిస్థాన్ ప్రధాన బ్యాటర్లు మంచి ఫామ్‌లోకి రావడం ఆ టీమ్‌కు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ఆ టీమ్ ప్రధాన బ్యాటర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు భారత గడ్డపై చెలరేగడంతో పాక్ టీమ్‌కు మరింత ఉత్సాహం వచ్చినట్లైంది. మరోవైపు పాక్ టీమ్ అసలు సమరానికి ముందే తమ సత్తా చూపించడంతో ప్రత్యర్థి టీమ్‌లకు వీరిని ఎదుర్కోవడం కష్టంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. న్యూజిలాండ్ టీమ్‌లో వరల్డ్ టాఫ్ ఫీల్డర్లు ఉన్నారు. ఆలాంటి ప్లేయర్లు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతులను వదిలి వేయడంతో కివీస్ మేనేజ్‌మెంట్ కాస్త ఆందోళనలో పడింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమైన కివీస్ బ్యాటింగ్‌లో అయినా రాణించాలని కివీస్ అభిమానులు కోరుకుంటున్నారు. #hyderabad #pakistan #century #babar #rizwan #warm-up-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి