BREAKING: 'ఎన్నికల్లో కశ్మీరీ పండిట్లు పోటి'! PoK మనదే! రాజ్యసభలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు!

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశానికి చెందినదని.. ఈ భూభాగాన్ని ఎవరూ లాక్కోలేరన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారని అమిత్ షా వ్యాఖ్యనించారు. జమ్ముకశ్మీర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్ష పార్టీల పెద్ద ఓటమి అన్నారు.

New Update
BREAKING: 'ఎన్నికల్లో కశ్మీరీ పండిట్లు పోటి'! PoK మనదే! రాజ్యసభలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు!

Amit Shah: రాజ్యసభలో రెండు బిల్లులను ఆమోదం పొందాయి. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370పై (Article 370) సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు (Jammu & Kashmir) ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం సమర్థించిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు (J&K Reservation Bill), 2023 అండ్‌ జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023పై జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఊచకోతకు గురైన తర్వాత కశ్మీరీ పండిట్లు లోయ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసందే. ఇప్పుడు వారంతా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

PoK మనదే:
పాక్‌ ఆక్రమిత కశ్మిర్‌పై అమిత్‌షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. PoK(పీఓకే) మనదేనని. ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వబోమని అమిత్ షా కుండబద్దలు కొట్టారు. నెహ్రూ హయాంలో జమ్ముకశ్మీర్‌కు సైన్యాన్ని పంపడంలో జాప్యం జరిగిందని స్వాతంత్ర్యం ముందు నాటి విషయాలను మరోసారి ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం 70శాతం తగ్గిందని.. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఒక్క రాళ్లదాడి ఘటన కూడా జరగలేదని తెలిపారు.


అమిత్‌షా (Amit Shah) ప్రసంగంలో కీ పాయింట్స్ ఇవే:
➼ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 24 సీట్లు రిజర్వ్‌ చేశాం- అమిత్ షా

➼ PoK(పీఓకే) మనదే.. ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వబోం- అమిత్ షా

➼ జమ్ములో సీట్లు 37 నుంచి 43కి, కశ్మీర్‌లో 46 నుంచి 57కి.. ఇలా మొత్తం 83 నుంచి 90కి పెంచాలని డీలిమిటేషన్ కమిషన్ సిఫారసు చేసింది- అమిత్ షా.

➼ జమ్ముకశ్మీర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్ష పార్టీల పెద్ద ఓటమి- అమిత్ షా.

➼ ఆర్టికల్ 370 పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. వేర్పాటువాదానికి దారితీసింది- అమిత్ షా.

➼ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం వెన్ను విరిచాం- అమిత్ షా

➼ 2004-2014 మధ్య కాలంలో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయి- అమిత్ షా

➼ గత 10 ఏళ్లలో కేవలం 2,197 ఉగ్రవాద ఘటనలు జరిగాయి- అమిత్ షా

➼ 'కశ్మీర్ ఆఫ్ ఇండియన్స్, ఇండియా ఆఫ్ కాశ్మీరీస్' -అమిత్ షా('మనోజ్ ఝా'కు కౌంటర్)

➼ ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు. 100 సినిమా షూటింగ్‌లు జరిగాయి. మూడు థియేటర్లు ప్రారంభించాం: అమిత్‌షా

➼ వేర్పాటువాదం గురించి మాట్లాడే వారిని కశ్మీరీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. -అమిత్ షా

➼ దేశంలో చాలా రాష్ట్రాలను విలీనం చేశారు మరే ఇతర రాష్ట్రానికి 370 ఆర్టికల్ ఎందుకు లేదు?- అమిత్‌షా

➼ గుజ్జర్ కమ్యూనిటీకి అందుతున్న ప్రయోజనాల్లో మార్పులు లేవు, ఉద్యోగం పోతుంది, చదువులో సీటు పోతుంది- అమిత్‌షా

మరోసారి నెహ్రూపై విమర్శలు:
రాజ్యసభ వేదికగా మరోసారి దేశ మొదటి ప్రధాని పండిట్‌ నెహ్రూపై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. నెహ్రూకి ఈ పని అప్పగించడం వల్లే దేశంలో జమ్ముకశ్మీర్‌ చేరిక ఆలస్యమైందని ఆరోపించారు.

Also Read: కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు