Shahabaz Sharif: పాకిస్థాన్‌ కొత్త ప్రధానికి ఐదుసార్లు పెళ్లి.. ముగ్గురితో విడాకులు

పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈయన కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. ఈయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Shahabaz Sharif: పాకిస్థాన్‌ కొత్త ప్రధానికి ఐదుసార్లు పెళ్లి.. ముగ్గురితో విడాకులు
New Update

Palistan New PM Shahabaz Sharif: పాకిస్థాన్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. అనేక రాజకీయాల మధ్య ఎట్టకేలకు పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. PML-N అధినేత నవాజ్‌ షరీప్‌, పీపీపీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని కూటమి.. షెహబాద్‌ షరీఫ్‌ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదన చేసింది. షెహబాజ్‌ షరీఫ్‌ మొదటగా పంజాబ్‌ ప్రావిన్సు నుంచి తన పొలిటికల్‌ కేరీర్‌ను మొదలుపెట్టాడు. మూడుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు.

పాక్‌ సైన్యంతో మంచి సంబంధం

షెహబాజ్‌ కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఆసియా ఖండంలోనే ధనవంతుల రాజకీయ నాయకుల జాబితాలో ఆయన కూడా ఉన్నారు. పాకిస్థాన్ సైన్యంతో.. షెహబాద్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ఈయన ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

విదేశాల్లో కూడా ఆస్తులు 

షెహబాజ్‌ షరీఫ్‌కు పాకిస్థాన్‌ కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. 2015లో ఆయన పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన ఆస్తుల ప్రకారం చూసుకుంటే లండన్‌లో అతని ఆస్తులు విలువ దాదాపు రూ.153 మిలియన్లు. ఇక పాకిస్థాన్‌లో రూ.108.24 మిలియన్లు. మొత్తం సంపంద పరిశీలిస్తే రూ.262.29 మిలియన్లు. మరో విషయం ఏంటంటే ఇవిగాక షరీఫ్‌కు సుమారు రూ.130.22 మిలియన్ల అప్పలు ఉన్నాయి. వీటిని తీసివేస్తే.. ఆయన నికర విలువ మొత్తం రూ.132.6 మిలియన్లు.

ఐదు పెళ్లిల్లు చేసుకున్న షరీఫ్

షరీఫ్‌.. తనకు 23 ఏళ్లు ఉన్నప్పుడు 1973లో తన ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా మొదటి పెళ్లి చేసుకున్నాడు. నుస్రత్‌ షెహబాజ్‌తో అతని వివాహం జరిగింది. అయితే నుస్రత్‌ షాబాజ్‌ మరణించడంతో.. షరీఫ్ 43 ఏళ్ల వయసులో 1993లో పాకిస్థాన్ మోడల్‌ అలియా హనీని పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అలియా విడాకులు తీసుకున్న కొద్ది రోజుల తర్వాత అనుమానస్పదంగా మరణించింది. ఆ తర్వాత షరీఫ్‌ 1993 నీలోఫర్‌ ఖోసాను పెళ్లి చేసుకున్నారు. మళ్లీ వీళ్లు కూడా కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్నారు.

కొన్నేళ్ల పాటు ఒంటరిగా జీవితాన్ని గడిపిన షరీఫ్‌.. 2003లో నాలుగోసారి పెళ్లి చేసుకున్నారు. పాకిస్థానీ రచయిత్రి, సామాజికవేత్త అయిన తెహ్మినా దురానీని వివాహం చేసుకున్నారు. సుమారు 8 ఏళ్ల పాటు వీళ్లు రహస్యంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 2012లో షరీఫ్‌కు 60 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈసారి ఆయన కుల్సూమ్‌ హాయి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్ల పెళ్లి కూడా రహస్యంగా జరింది. అయితే వీళ్లు కూడా ఇప్పటికే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

#telugu-news #pakistan-pm-shehbaz-sharif #pakistan-news #shahabaj-shareef
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe