Legends League: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ ఫైనల్స్ లో పాకిస్తాన్ 

క్రికెట్ లెజెండ్స్ టీమ్స్ మధ్య జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్స్ లో వెస్టిండీస్ ఛాంపియన్స్ పై పాకిస్తాన్ ఛాంపియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.  దీంతో టోర్నీ ఫైనల్స్ కి చేరుకుంది పాకిస్తాన్. 

Legends League: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ ఫైనల్స్ లో పాకిస్తాన్ 
New Update

Legends League:  ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. పాకిస్తాన్ ఛాంపియన్స్-వెస్టిండీస్ ఛాంపియన్స్ మధ్య జరిగిన మొదటి సెమీ-ఫైనల్‌లో, పాకిస్తాన్ ఛాంపియన్స్ 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్‌లను ఓడించగలిగింది. ఇండియా ఛాంపియన్స్ .. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మధ్య జరిగే రెండవ సెమీ ఫైనల్లో గెలిచిన జట్టు జూలై 13న ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో తలపడుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఛాంపియన్స్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్‌ 19.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

10 పరుగులకే 3 వికెట్లు

Legends League:  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఛాంపియన్‌కు ఆరంభం బాగా లేదు. ఓపెనర్ షర్జీల్ ఖాన్ తొలి ఓవర్ లోనే ఔట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత  రెండో ఓవర్‌లోనే రెండో  వికెట్ పడింది. ఈ క్రమంలో  పాక్‌ చాంపియన్‌ జట్టు 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు పాకిస్థాన్‌ను గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించారు. 

యూనిస్ ఖాన్ హాఫ్ సెంచరీ

Legends League:  ఈసారి పాక్ ఛాంపియన్స్ తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూనిస్ ఖాన్ 45 బంతుల్లో 65 పరుగులతో చెలరేగిపోయాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉన్నాయి. అతనికి తోడు కమ్రాన్ అక్మల్ 46 పరుగులు చేశాడు. చివర్లో అమెర్ యామిన్ .. సొహైల్ తన్వీర్ వరుసగా 40 పరుగులు .. 33 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరి బ్యాటింగ్ ఊపుతో పాక్ చాంపియన్ జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది.

విండీస్‌ ఆలౌట్‌

Legends League:  లక్ష్యాన్ని ఛేదించదానికి బరిలో దిగిన  వెస్టిండీస్ జట్టు 35 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పింది. తరువాత ఓపెనర్ గేల్ 22 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. డ్వేన్ స్మిత్ కూడా 26 పరుగులకే అవుట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో యాష్లే నర్స్ 36 పరుగులతో పోరాట ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో రాయద్ ఎమ్రిట్ 9 బంతుల్లో 29 పరుగులు చేసి విజయం కోసం పోరాడినా జట్టు విజయ తీరాలను తాకలేకపోయింది.

#pakistan #cricket #legends-league
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe