Milk Price : లీటర్‌ పాల ధర రూ.370... ఎక్కడంటే!

పాక్‌ లో పాల ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్‌ ధర రూ. 370 కి చేరింది. అక్కడి ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతుండగా.. అక్కడి ప్రభుత్వం కొత్తగా పాలపై టాక్స్‌ విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Milk Price : లీటర్‌ పాల ధర రూ.370... ఎక్కడంటే!
New Update

Pakistan : పాక్‌ లో పాల ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్‌ ధర రూ. 370 కి చేరింది. అక్కడి ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతుండగా.. అక్కడి ప్రభుత్వం కొత్తగా పాలపై టాక్స్‌ (Milk Tax) విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా (Australia) కంటే పాల ధరలు (Milk Price) పాకిస్తాన్‌లోనే అధికంగా ఉండటం గమనార్హం.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పాకిస్తాన్‌లో పాలపై ఇంతకుముందు ఎలాంటి పన్నూ ఉండేది కాదు. కానీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్‌ పాలపై ప్రభుత్వం 18 శాతం టాక్స్‌ విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా. కొత్తగా పన్ను వేయడంతో కరాచీ (Karachi) లో అల్ట్రా హై టెంపరేచర్‌ పాల ధర 370 రూపాయలకు చేరింది.

పారిస్‌లో 1.23 డాలర్లు కాగా.. మెల్బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే. పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Also read: పవన్‌ కు హరిరామజోగయ్య మరో లేఖ!

#pakisthan #milk-price #liter-370
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe