/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Fawad-Chaudhry.jpg)
Fawad Chaudhry That Defeat Modi : లోక్‌సభ ఎన్నికల 2024 (Lok Sabha Elections 2024) చివరి దశ ఓటింగ్ (Voting) జూన్ 1న జరగనుంది. కాగా, రాహుల్ గాంధీ (Rahul Gandhi), అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ను ప్రశంసించిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి 'మోదీ (Modi) ని ఓడించండి' అని బహిరంగ పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల మధ్యలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ తుఫాను సృష్టించాయి. మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వడం ద్వారా నరేంద్ర మోడీని ఓడించాలని కోరుకుంటున్నానంటూ ఫవాద్ చౌదరి అన్నారు. వార్తా సంస్థ IANS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ నాయకుడు ఫవాద్ మాట్లాడుతూ, “ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓటమి అవసరం. భారతదేశం - పాకిస్తాన్ రెండుచోట్లా తీవ్రవాదం ఓడిపోయినప్పుడు మాత్రమే భారతదేశం - పాకిస్తాన్ సంబంధాలు మెరుగవవుతాయి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Fawad Chaudhry: ‘‘పాకిస్థాన్‌లో భారత్‌పై ఎలాంటి ద్వేషం లేదు. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. భారతీయ ఓటర్లు తెలివితక్కువవారు కాదు. హిందుస్థాన్ ప్రగతిశీల దేశంగా కొనసాగాలి' అని పాక్ నాయకుడు అన్నారు. రాహుల్ గాంధీ అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, మమతా బెనర్జీ అయినా - మోడీని ఎవరు ఓడించినా వారికి ఆల్ ది బెస్ట్ అని చౌదరి అన్నారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
అంతకుముందు చౌదరి కేజ్రీవాల్‌ను సమర్థిస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మీరు మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండంటూ వ్యాఖ్యానించారు. “చౌదరి సాహిబ్, నేను, నా దేశ ప్రజలు మా సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోగలము. మీ ట్వీట్ అవసరం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మీరు మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అని కేజ్రీవాల్ చౌదరి మాటలపై తీవ్రంగా స్పందించారు.
రాహుల్ గాంధీపైనా, అరవింద్ కేజ్రీవాల్‌పైనా నాకు ఎలాంటి అభిమానం లేదు. తన అభిప్రాయం కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించదని పాక్ నాయకుడు అన్నారు. “కానీ ఉగ్రవాదులకు అండగా నిలిచే ఎవరికైనా నేను మద్దతు ఇస్తాను. మోదీ ద్వేషానికి, తీవ్రవాదానికి ప్రతీక. హిందూ మహాసభ ఆవిర్భావం కారణంగా భారతదేశంలోని ముస్లింలు తీవ్ర శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారు, పాకిస్థాన్ వ్యవస్థాపకుడు భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల హక్కుల కోసం నిలబడతామని హామీ ఇచ్చారు. ఇందులో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. కానీ భారతదేశంలో ముస్లిం హక్కుల కోసం నేను ఏ హోదాలో అయినా మాట్లాడతాను. ద్వేషపూరిత శక్తులను ఓడించడం.. విద్వేషం, తీవ్రవాద RSS-BJPలను ఓడించడం ఒక పాయింట్. మోదీని ఎవరు ఓడించినా ప్రపంచ గౌరవం దక్కుతుందని ఫవాద్ అన్నాడు.