/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-9.jpg)
Pakistan cricket: పాక్ టీమ్ వరుస అపజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతోపాటు తాగాజా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంపై మాజీలతోపాటు బోర్డ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లేయర్ల ఎంపిక సరిగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డ్ ఆటగాళ్ల సెలక్షన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయం తీసుకోవడం క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది.
PCB chairman Mohsin Naqvi has revealed that the board is using artificial intelligence (AI) to prepare squads for the upcoming Champions Cup 👀#ChampionsCup #PCB #MohsinNaqvi #AI #CricketTwitter pic.twitter.com/IHQLsAksgv
— InsideSport (@InsideSportIND) August 27, 2024
పాక్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది..
ఈ మేరకు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కానీ ప్రపంచకప్ టోర్నీకి ఈ పని చేయలేకపోయామని, కొత్తవారిని జట్టులోకి తీసుకోవడానికి సరైన డేటా లేదన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు త్వరలో జరిగే మెగా టోర్నీ కోసం ఏఐ సాయంతో ఆటగాళ్ల సెలక్షన్ కూడా జరిగిపోయిందని స్పష్టం చేశారు.
ప్రతిభను గుర్తించే ప్లానింగ్ లేదు..
మా దగ్గర యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే ప్లానింగ్ లేదు. ఇక్కడి వ్యవస్థ సరిగా లేదు. త్వరలో జరిగే ఛాంపియన్స్ కప్ కోసం కొంతమంది యువకులను గుర్తించాం. టాలెంటెడ్ ప్లేయర్ల డేటాను సేకరిస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేశాం. ఇందులో ఏఐ పాత్ర 80 శాతం. సెలెక్షన్ కమిటీ పాత్ర 20 శాతం ఉంది. సరిగా ఆడని ప్లేయర్లను వెంటనే రీప్లేస్ చేస్తామని నఖ్వీ వివరించారు.
ఇదిలా ఉంటే.. ఏఐ సాయం తీసుకున్న పీసీబీపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ సాయం తీసుకుంటే సెలెక్టర్లు ఎందుకని, లక్షల జీతాలు ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం పాక్ అంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుందంటూ సెటైర్స్ వేస్తున్నారు.