Shahzaib Rind Vs Rana Singh: ఇండియా, పాకిస్తాన్...ఈ రెండు దేశాల గురించి తెలియనిది ఎవరికి. నిజానికి ఒకప్పుడు ఒకే దేశంగా ఉండి...తర్వాత విడిపోయి బద్ధ శత్రువుతగా మారిపోయారు. ఇది అయి 75 ఏళ్ళు పైన అవుతున్నా ఆ శత్రుత్వాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడో ఒక చోట ఇరు దేశాల మధ్య వైరం బయటపడుతూనే ఉంటుంది. అందులోకి ఆటల విషయంలోకి వస్తే ఇది మరింతగా కనిపిస్తుంది. సాధారణంగా భారత్, పాకిస్తాన్ (India - Pakistan) మధ్య ఏ గేమ్ జరిగినా.రెండు జట్లు...లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీలా కాకుండా రెండు దేశాల మధ్య పోటీగా మారిపోతుంటుంది. క్రికెట్ అలాంటి వాటిల్లో అయితే జనాలు కొట్టుకునే స్థాయి వరకు కూడా ఉంటుంది అ వైరం. ఆటగాళ్ళ మధ్య ఇలాంటి భావనలు లేకపోయినా..ఆ సమయానికి వాతావరణానికి తగ్గట్టు వారు కూడా అలా మారిపోతారు. కానీ దీనికి అతీతంగా ప్రవర్తంచారు పాకిస్తాన్ కరాటే ఆటగాడు. అతను చేసిన పనికి రెండు దేశాల ప్రజలు ఫిదా అయిపోతున్నారు.
ఇరు దేశాల జెండాలతో పోడియం మీదకు...
ఇండియా, పాకిస్తాన్ ఆటగాళ్ళ మధ్య కరాటే కాంబాట్ లీగ్ (Karate Combat League) పైనల్ పోటీ జరిగింది. ఇందులో ఇరు దేశాల ఆటగాళ్ళు పోటీపోటీగా తలపడ్డారు. కానీ చివరకు పాకిస్తాన్ ప్లేయర్ షహజాబ్ రింథి గెలిచాడు. షహజాబ్ రింధి 2-1తో భారత ఆటగాడు రానా సింగ్‌ను ఓడించాడు. నిజానికి ఇది చాలా మామూలు గేమ్. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏంలేదు. క్రికెట్, మిగతా ఆటల్లా కరాటే అంత పాపులర్ కూడా ఏమీ కాదు. కానీ గేమ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాడి గెస్చర్ ఈ మొత్తం వ్యవహారంగ ఉరించి మాట్లాడుకునేలా చేసింది. పోటీలో విజయం సాధించిన తర్వాత ఏ గేమ్‌లో అయినా ఆటగాళ్లు తమ దేశ పతాకంతో బహుమతిని అందుకోవడానికి వెళతారు. అయితే షహజాబ్ మాత్రం బహుమతిని అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఇండియా, పాకిస్తాన్ రెండు జెండాలతో పోడియం మీదకు వెళ్ళాడు. ఇదిగో షహజాబ్ చేసిన ఈ పనే అందరూ మాట్లాడుకునేలా చేసింది.
వైరం కాదు స్నేహమే ఉంది..
తాను చేసిన పని గురించి పాకిస్తాన్ ఆటగాడు షహజాబ్ మాట్లాడుతూ..మా ఇద్దరి మధ్యా ఫైట్ పీస్ గురించి జరిగింది. మా అటలో కానీ...మేము చేసిన పనిలో కానీ వైరానికి తావే లేదు. మేము ఎప్పుడూ శత్రువలం కాదు. ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించగలుగుతాం. మా ఇద్దరి మధ్యా పోటీ ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహ బంధానని పెంపొందించేలా చేస్తుంది. అందుకే తాను రెండు జెండాలతో వేదిక మీదకు వచ్చాననని చెప్పాడు షెహజాబ్. దాంతో పాటూ తమ పాటను చూడ్డానికి వచ్చిన సల్మాన్ ఖాన్‌ను కూడా షెహజైబ్ థాంక్స్ చేప్పాడు. తాను చిన్నప్పటి నుంచి సల్మాన్ సినిమాలను చూస్తూ పెరిగానని..ఈ రోజు ఇలా ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పాడు.
ఎంత గొప్పగా చెప్పాడో..
షెహజైబ్ చేసిన పని అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతనికి భారతీయులు అందరూ ఫిధా అవుతున్నారు. ఎంత గొప్పగా మాట్లాడాడు అంటూ తెగ పొగడ్తల్లో ముంచేస్తున్నారు నెటిజన్లు. అందరూ అతని నుంచి స్ఫూర్తి పొందాలని అంటున్నారు.
Also Read:Gujarat: సూరత్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి..పోటీయే లేదు