Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

వాలెంటైన్స్ డే సందర్భంగా నటి పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పబ్బులో తన ప్రియుడి తల పై బాటిల్ తో కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

Paayal Raajput Video: పాయల్ రాజ్ పుత్.. ఈ పంజాబీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RX 100 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ పడడంతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నటించిన వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కాస్త సక్సెస్ కు దూరమైన ఈ బ్యూటీ.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో పాయల్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది.

ఇటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే పాయల్ తన లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ షో చేస్తుంటుంది. ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పాయల్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.

Also Read: Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

ప్రియుడి తల పగలగొట్టిన పాయల్

పబ్బులో తన ప్రియుడు సౌరభ్‌ తలపై బాటిల్ తో గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాయల్. ఈ వీడియోను షేర్ చేస్తూ.. "నా వాలెంటైన్స్ రోజును ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాను. మరి మీరు..? " అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన కొంత మంది నెటిజన్లు సినిమా షూట్ లో భాగమని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో వెరీ గుడ్.. ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో రియల్ కాదు.. రీల్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఇది 3 రోజెస్ మూవీ క్లైమాక్స్ షూట్ లో భాగంగా పాయల్ ఇలా చేసిందని తెలుస్తోంది.

పంజాబ్ ఇండస్ట్రీలో మొదలైన పాయల్, సౌరబ్ పరిచయం ప్రేమగా మారింది. వీళ్లిద్దరు కలిసి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అప్పుడప్పుడు పాయల్, సౌరబ్ షికార్లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల అవుతుంటాయి. ఇక ప్రస్తుతం పాయల్ తెలుగు, తమిళ్ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది.

Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు