నూహ్ అల్లర్లపై పీఎం నోరువిప్పుతారా? ముస్లింలకు ఏం సందేశం ఇస్తారు? ఓవైసీ సూటిప్రశ్న...!

హర్యానాలోని నూహ్‌లో అల్లర్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతను ఏఐసీసీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీనికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తాను ఆశిస్తున్నట్టు ఓవైసీ వెల్లడించారు. ప్రధాని మోడీ సబ్ కా సాథ్, సబ్ వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదం ఇప్పుడు ఎక్కడ ఉందన్నారు.

author-image
By G Ramu
నూహ్ అల్లర్లపై పీఎం నోరువిప్పుతారా? ముస్లింలకు ఏం సందేశం ఇస్తారు? ఓవైసీ సూటిప్రశ్న...!
New Update

హర్యానాలోని నూహ్‌లో అల్లర్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతను ఏఐసీసీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. కూల్చివేతను ఒక వర్గానికి విధించిన సామూహిక శిక్షగా ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీనికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తాను ఆశిస్తున్నట్టు ఓవైసీ వెల్లడించారు.

మనం రేపు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నామని చెప్పారు. ఈ దేశ ప్రజలకు ముఖ్యంగా ఈ దేశ స్వాంతంత్ర్యం కోసం అన్నింటినీ త్యాగం చేసిన నూహ్ ముస్లింలకు మీరు ఈ సందేశాన్ని ఇస్తున్నారని అన్నారు. నూహ్ లో జరిగిన హింసాకాండను తాము ఖండిస్తున్నామని చెప్పారు. కానీ మీరు మాత్రం ఒక వర్గానికి సామూహిక శిక్ష విధిస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రధాని మోడీ సబ్ కా సాథ్, సబ్ వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదం ఇప్పుడు ఎక్కడ ఉందన్నారు. ఈ దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు లేవా అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో చట్టాన్ని పాటించాల్సిన అవసరం లేదా అని ఆయన నిలదీశారు. ప్రధాని మోడీకి ముస్లింల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు వున్నా ఓ లక్షిత దాడులను స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఖండిస్తారని తాను భావిస్తున్నానన్నారు.

ఈ బుల్‌డోజర్లను ఎక్కడ ఉపయోగించడం లేదని ఆయన ప్రశ్నించారు. యూపీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో బుల్డోజర్లను ఉపయోగించలేదా అని నిలదీశారు. మీరే చట్టం, న్యాయస్థానాలుగా మారితే ఇక సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానంలో అమిత్ షా మూడు బిల్లులను ఎందుకు తీసుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు.

#buldozers #asaduddin-owaisi #pm-modi #nuh-violence
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి