![పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి మొబైల్ కారణమా?](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-17T074009.403-jpg.webp)
Health Risks of Using Mobile Phones: మొబైల్ అధికంగా వాడే పురుషుల అనారోగ్యానికి సంబంధించి తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ జనరేషన్ మొత్తం రోజంతా తిండిలేకపోయినా పర్వలేదు కానీ తమవెంట సెల్ ఫోన్, అందులో సరిపడా రిచార్జ్ లేకపోతే అల్లాడిపోతున్నారు. నిరంతరం అందులోనూ తలదూర్చుతూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఏదైనా అవసరానికి మించి వాడితే దుష్పప్రయోజనాలు తప్పవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ మగాళ్లకు చాలా కీడు చేస్తుందని, లైంగిక సామర్థం దెబ్బతీస్తుందని వెల్లడించారు.
Also read : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
ఈ మేరకు ఇటీవల కాలంలో పెళ్లైన జంటల్లో చాలామందికి పిల్లలు పుట్టడం లేదు. కొంతమందికి చాలా ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో (Software Employees) ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. అయితే ఎందుకిలా జరుగుతుందనే విషయంపై పరిశోధనలు చేసిన ఓ యూనివర్సీటికీ చెందిన వైద్యులు మొబైల్ వాడకం వల్ల గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ (Sperm Count) 50% కంటే ఎక్కువ పడిపోయిందని వెల్లడించారు. అలాగే కాలుష్యం, ఫరెవర్ కెమికల్స్, ఆహారం, నీటిలో విషపదార్థాలు, ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులతో సహా ఎప్పుడూ వెంటే ఉండే మొబైల్ ఫోన్ ఇందుకు కారణమని పేర్కొన్నారు.
18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు తమ ఫోన్‌లను రోజుకు 20 కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారని కనుగొన్నారు. వీరిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే ప్రమాదం 21% ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఈ 13 సంవత్సరాల అధ్యయనంలో ఫోన్ (Mobile Phones) సాంకేతికత మెరుగుపడటంతో స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం తగ్గడం ప్రారంభించిందని పరిశోధకులు గుర్తించారు. ఆధునిక 4G, 5G వెర్షన్‌లతో పోలిస్తే పాత 2G, 3G ఫోన్‌లు భారీ ప్రభావం చూపిస్తున్నాయని వివరించారు. కానీ స్పెర్మ్ ఆకారం, చలనశీలతలో ఎటువంటి క్షీణత, డిఎన్ ఏలో ఎలాంటి మార్పు లేకపోవడం ఊరట కలిగించే విషయమన్నారు. చివరగా రెడీయేషన్ (Radiation) ఎఫెక్ట్ ఉండే ఏ పరికరాన్ని అయినా వీలైనంత తక్కువగా యూజ్ చేయాలని సూచించారు.