Food Poison: పొరపాటున కూడా వీటిని రీ-హీట్ చేసి తినవద్దు, తాగవద్దు.. డేంజర్‌లో పడినట్టే! కొన్ని ఆహార పదార్థాలను రీ-హీట్ చేసి తింటుంటారు, తాగుతుంటారు. నూనెను మళ్లీ వేడి చేసి రీ-యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన కూడా పడవచ్చు. టీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. By Vijaya Nimma 30 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Food Poison: చాలామంది తిన్న తర్వాత ఫుడ్ ఐటెమ్స్ మిగిలిపోతే వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి తర్వాత రీ-హీట్ (Re-heat) చేసి తింటుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని ఆహారాలు వేడి చేసిన తర్వాత తింటే మీ శరీరానికి విషపూరితం చేస్తాయి. కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ను వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్ ఐటెమ్స్ రీహీట్ చేయోద్దో వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది సరైన పద్ధతి కాదు చాలా మంది టీ చల్లారిపోయిందని మళ్లీ రీ-హీట్ చేసి తాగుతుంటారు. ఇది సరైనది కాదు. మళ్లీ వేడి చేసి టీ తాగడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తిమ్మిర్లు, జీర్ణక్రియ లాంటి సమస్యలు ఎదురవుతాయి. పూరీలు మొదలైనవి తయారు చేసేటప్పుడు ఆ నూనెను తిరిగి ఉపయోగిస్తాము. కానీ నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల కడుపు ట్రాన్స్ ఫ్యాట్ గా మారుతుందని మీకు తెలుసా..? ఇది కడుపు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా పుట్టగొడుగులను మళ్లీ ఉడికించి తింటే వాటిలో ఉండే ప్రోటీన్ పోతుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు అస్సలు మంచిది కాదు. బచ్చలికూరలో ఇనుము కనిపిస్తుంది. ఇది తిరిగి వేడి చేసేటప్పుడు ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ లాంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది కూడా చదవండి: భోజనం తర్వాత కడుపులో మంట పెడుతుందా? ఈ హోం రెమెడీస్ మీ కోసమే! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: వేయించిన శనగలు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! #food-poison #health-benefits #tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి