Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ వద్ద మందాకిని నదికి వరద పోటెత్తటంతో 13 మంది గల్లంతయ్యారు. దాదాపు 12 వరకూ షాపులు గల్లంతయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆగకుండా వర్షాలు పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం గురువారం అర్థరాత్రి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి పక్కనున్న కొండ చరియలు విరిగి కింద నున్న రెండు షాపుల మీద పడ్డాయి. ఆ సమయంలో షాప్ లోపల చాలా మంది నిద్రిస్తున్నారు. దాంతో ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కొంత మంది గల్లంతు కాగా బండరాళ్లు పడడంతో రెండు దుకాణాలు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో అందులో నిద్రిస్తున్న వారంతా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. . సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్టీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
గాలింపు చర్యలు ముమ్మరం చేశాం
గల్లంతయిన 13 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరథామి(Uttarakhand CM Pushkar Singh Dhami) తెలిపారు. ఇందులో ఎనిమిది మందిని నేపాలీ వాళ్లుగా గుర్తించామని, మిగిలిన వాళ్ల వివారాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. భారీ వర్షానికి తోడు పైనుంచి రాళ్లు, వ్యర్థపదార్థాలు వచ్చి మీద పడుతూండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని ఎన్డీ ఆర్ ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారీవర్షసూచన
మందాకిని నది(Mandakini River) ఉదృతంగా ప్రవహిస్తోంది. డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఇకపోతే శుక్రవారం (4.8.23) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం . శని వారం కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పడతాయని, మళ్లీ ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
కేదార్ నాథ్ మార్గంలో కాలినడక ప్రారంభం అయ్యే ప్రాంతం గౌరీకుండ్. ఈ ప్రాంతంలో భారీ వరదలు రావటం, ప్రాణ నష్టం సంభవించటం కొత్త కాదు. 2013లోనూ మందాకినీ నది తన ప్రతాపాన్ని చూపించింది.
Also Read: లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!