CM Jagan: ముందు జగన్.. తరువాతే చంద్రబాబు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో ముందుగా సీఎం జగన్ తో మాట్లాడాలనుకుంటున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. తరువాత చంద్రబాబుతో మాట్లాడుతామని అన్నారు. మా మొదటి ప్రయారిటి జగన్ అని అన్నారు.

New Update
CM Jagan: ముందు జగన్.. తరువాతే చంద్రబాబు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

Manda Krishna Madiga: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ (Classification of SC Reservation) విషయంలో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడుతాం అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. దీనిపై త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో (CM Jagan) మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని.. కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేం అని తేల్చి చెప్పారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం, మాదిగల వర్గీకరణ అంశాలను ప్రధానంగా తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు

ఫస్ట్ సీఎం జగనే..

ఈ విషయాలపై మాట్లాడేందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని.. రెండో ప్రాధాన్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న తమ ఎస్సీ నాయకుల సహాయంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా తమకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకే ఈ సమావేశం పెట్టినట్లు తెలిపారు. జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుంటే దగ్గరగా ఉంటాం, లేకుంటే దూరంగా ఉంటాం అని తేల్చి చెప్పారు.

17న సుప్రీంకోర్టులో చర్చ...

తమ మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై చర్చకు రాబోతుందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం తొందర పడుతున్నామని అన్నారు. జగన్ త్వరగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 20 సంవత్సరాల తరువాత మరలా సుప్రీం కోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంపై విచారణ జరగబోతుందని అన్నారు.

వ్యతిరేకంగా తీర్పు...

గతంలో వైయస్సార్ ఉన్న కాలంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ జరిగిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. అయితే అప్పుడు తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని తెలిపారు. మరలా రాజశేఖరరెడ్డి కుమారుడు ప్రభుత్వంలో విచారణకు వచ్చిందని.. ప్లీనరీలో జగన్ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని, నాన్న గారి ఆశయాలకు అనుకూలంగా ఉన్నానని తెలిపారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

50 శాతం ఉన్నారు...

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా ఉందని మంది కృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే కసరత్తుకు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుని, పార్టీ పరంగా లేఖ రాయాలని సీఎం జగన్ ని కోరనున్నట్లు తెలిపారు. మమ్మల్ని మిత్రులుగా చూడండి, వ్యతిరేకులుగా చూడకండి అని అన్నారు. రేపటి నుంచి 16 వ తేదీలోగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మాదిగ రెల్లి కులాలు 50 శాతం ఉన్నారని పేర్కొన్నారు. దామాషా ప్రకారం తమకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలని అన్నారు. నాలుగు పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్తానాలు మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు