OTT: ఈ వారంలో ఓటీటీలో సందడే సందడి.. అర్థమైందా రాజా

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. దీంతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకరర్’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. ఈవారం ఏయే సినిమాలు విడుదలయ్యాయో ఓ లుక్కేద్దాం.

New Update
OTT: ఈ వారంలో ఓటీటీలో సందడే సందడి.. అర్థమైందా రాజా

OTT: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. దీంతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకరర్’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. ఈవారం ఏయే సినిమాలు విడుదలయ్యాయో ఓ లుక్కేద్దాం.

చిరు.. భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ మూవీ ఓటీటీలో ఏమాత్రం ఆకట్టుకుందో చూడాలి. నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Bhola Shankar Collections

రజినీ.. జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లు వసూళ్లు రాబట్టి రజనీ స్టామినా మరోసారి నిరూపించింది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో జైలర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

publive-image

నవాజుద్దీన్‌.. హడ్డీ

హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్థిఖీ ట్రాన్స్‌జెండర్‌ పాత్రతో ప్రేక్షకులను అలరించిన ‘హడ్డీ’ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మాయిగా మారాలనుకునే హరి అనే పాత్రలో సిద్ధిఖీ నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

publive-image

నెట్‌ఫ్లిక్స్..

షేన్‌ గీల్లీస్‌ (హాలీవుడ్‌)-సెప్టెంబరు 5

స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్‌)-సెప్టెంబరు 5

కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3)-సెప్టెంబరు 7

టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2)- సెప్టెంబరు 7

వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌)- సెప్టెంబరు 7

సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2)- సెప్టెంబరు 8

అమెజాన్‌ ప్రైమ్‌..

వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌)- సెప్టెంబరు 5

లక్కీ గౌ (హిందీ)- సెప్టెంబరు 6

సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్‌)- సెప్టెంబరు 8

డిస్నీ+హాట్‌స్టార్‌..

ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2)- సెప్టెంబరు 6

ఆహా..

లవ్‌ (తమిళ్)- సెప్టెంబరు 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 8

బుక్ మై షో..

లవ్ ఇన్ ది రోడ్ (హాలీవుడ్)- సెప్టెంబరు 8

Advertisment
తాజా కథనాలు