OU: అర్థరాత్రి ఓయూ లేడిస్ హాస్టల్లో చప్పుళ్లు...తమకు భద్రత లేదంటూ విద్యార్థినుల ఆందోళన..!! ఓయూలో తమకు రక్షణ లేదంటూ విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ క్యాంపస్ లోకి చొరబడి డోర్లు కొట్టారంటూ వాపోతున్నారు. హాస్టల్లో తమకు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరున నిరసిస్తూ ధర్నా చేపట్టారు. By Bhoomi 08 Jan 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి ఓయూలో తమకు రక్షణ కరువైదంటూ విద్యార్థినులు ఆందోళనచేపట్టారు. సరైన సౌకర్యాలు లేవని ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు హాస్టల్ క్యాంపస్ లోకి చొరబడి డోర్లు కొట్టారంటూ వాపోతున్నారు. క్యాంపస్ లో అమ్మాయిలకు రక్షణ లేదని మండిపడుతున్నారు. సెక్యూరిటీ లోపాలు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బయటి వ్యక్తులు హాస్టళ్లోకి ప్రవేశించి విద్యార్థినులను భయబ్రాంతులకు గురి చేస్తన్నారని వాపోతున్నారు. సెక్యూరిటీ లోపాలు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బయట వ్యక్తులు లేడీస్ హాస్టళ్లోకి ప్రవేశించి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థినుల భద్రతను పట్టించుకోవల్సిన అధికార యంత్రంగా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుని ఆ తర్వాత వదిలేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీని ఓయూలోని ఇంజనీరింగ్ లేడస్ హాస్టల్లోకి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఇద్దరు అగంతకులు అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విద్యార్థినులు సెక్యూరిటీ సిబ్బందికి చెప్పేలోపే అక్కడి నుంచి పారిపోయారు. తిరిగి రాత్రి 11.30గంటలకు, అర్థరాత్రి 2గంటలకు ఆగంతకులు మరోసారి హాస్టల్ గోడలోకి దూకి లోపలికి చొరబడ్డారు. వారిని గుర్తించిన అమ్మాయిలు హాస్టల్ గదుల్లో లైట్లు వేసి కేకలు పెట్టారు. మరోసారి దుండగులు గోడదూకిపారిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పగా లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారని విద్యార్థులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఈ చిన్న తప్పే.. మిమ్మల్ని డయాబెటిస్ బాధితులుగా మార్చుతుందని మీకు తెలుసా? గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి: 2011లో తెల్లవారుజామున ఓ ఆగంతకుడు లేడీస్ హాస్టల్ మెయిన్ గేటు నుంచి అమ్మాయిల గదుల్లోకి వెళ్లేందుకు యత్నించాడు. ఆగంతకుడిని గమనించిన అమ్మాయిలు గట్టిగా కేకలు వేయడంలో హాస్టల్ వెనక వైపు కూలిపోయిన కాంపౌండ్ వాల్ దూకి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ఓఎస్ డి ప్రొఫెసర్ లక్ష్మయ్య హాస్టల్ కు రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు అతన్ని గదిలో వేసి బంధించారు. ఓయూ అధికారులు హాస్టల్ కువచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఓఎస్డీని విద్యార్థులు విడిచిపెట్టారు. అదే ఏడాది జూన్ లో సమావేశం నిర్వహించి సెక్యూరిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అమలు మాత్రం చేయాలు. కొద్ది నెలలకే ఓ వ్యక్తి లేడీస్ హాస్టల్లోకి దూరి ఏకంగా ఓ అమ్మాయి గదిలో ఉన్న ల్యాప్ టాప్ దొంగలించాడు. ఈ రెండు ఘటనల్లో ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. #hyderabad #osmania-university #ou #safety #osmania మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి