తమను 'ద్రోహులు" అని వ్యాఖ్యానించటంపై విపక్ష పార్టీల నేతలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గోయల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాయి. మరోవైపు డెరిక్ ఒబ్రెయిన్ ను సస్పెండ్ చేయాలన్న అంశంపై ఓటింగ్ చేపట్టకపోవటంతో, ఆ నిర్ణయం అమలులోకి రాలేదు.
అవిశ్వాసంపై చర్చలో ఎవరేమన్నారు?
సుప్రియా సులే..ఎన్సీపీ.
గత తొమ్మిదేళ్లుగా బీజేపీ తొమ్మది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది. అరుణాచల్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, పాండిచేరి, మహారాష్ట్ర (రెండు సార్లు). మణిపూర్ సంఘటనకు సంబంధించి హింస, దౌర్జన్యం, రేప్ తదితర అంశాలకు సంబంధించి పదివేల వరకూ కేసులు నమోదు అయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలి.
టీఆర్ బాలు, డీఎంకె
మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మణిపూర్‌లో మైనార్టీలు దారుణంగా హింసకు బలవుతున్నారు. ఇప్పటివరకు 143మంది చనిపోయారు. 65వేల మంది రాష్ట్రాన్ని విడిచి పెట్టారు. మహిళలను నగ్నంగ ఊరేగించి.. అందులో ఒకరిని గ్యాంగ్ రేప్ చేసినా సీఎం నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రధాని పార్లమెంట్‌కి రావడంలేదు. మణిపూర్ అట్టుడుకుతున్నా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ఇండియా కూటమిలోని పార్టీలు మణిపూర్‌ని సందర్శించాయి.. బాధితులతో మాట్లాడాయి.
సుస్మితా దేవ్, తృణమూల్
మణిపూర్ అంశంపైన చర్చించాలని మేము పట్టుబడుతున్నాం. ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తోంది. అందుకే 'ఇండియా" లో భాగస్వాములయిన పార్టీలన్నీ వాకౌట్ చేస్తున్నాయి అని ప్రకటించారు.
అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ
ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకుంటానని చెబుతోంది. ధరల పెరుగుదల, ఉపాధి కల్పన వంటి అంశాలను పట్టించుకోందా అని ప్రశ్నించారు.
సౌగత్ రాయ్, మణిపూర్ ఎంపీ
మణిపూర్ అట్టడికిపోతుంటే, పార్లమెంటుకు రాకుండా ప్రధాని విదేశీపర్యటనలు చేయటమేమిటి?
బీజేపీ నేత దూబే ప్రసంగిస్తూండగా, సోనియా గాంధీ పగలబడి నవ్వారు.
Also Read: లోక్‌సభలో అవిశ్వాస యుద్ధం..