PM Modi: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ఆ సమయంలో స్వతంత్ర భారతదేశంలో దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒకే పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇది మాములు విషయం కాదని, ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని కొందరు కావాలనే మరుగున పెడుతున్నారన్నారు.
పదేళ్ల పాలన ముగిసిందని, మరో 20 ఏళ్లు మిగిలిపోయాయని పేర్కొన్న ప్రధాని మోదీ, వచ్చే ఐదేళ్లు పేదరికంపై నిర్ణయాత్మక పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.అంతకుముందు ప్రతిపక్ష పార్టీ నేతలను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, ప్రతిపక్ష పార్టీల నినాదాల మధ్య ప్రధాని మోదీ ప్రసంగించారు.
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని పట్టించుకోకుండా విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజం వినే శక్తి లేదని దేశం చూస్తోందని అన్నారు.
Also Read: ఇకపై 132 సీట్ల బస్సులు.. విమానం తరహాలో హోస్టెస్!