OPPO: మార్కెట్లోకి ఒప్పో ఏ 38 సిరీస్‌ ఫోన్‌!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ ఒప్పో ఏ సిరీస్ లో మరో స్మార్ట్‌ ఫోన్‌ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమయ్యింది. ఒప్పో ఏ 38 పేరుతో యూఏఈ, మలేషియా అంతర్జాతీయ మార్కెట్ లోకి సీక్రెట్ గా వచ్చి రిలీజయ్యింది.

OPPO: మార్కెట్లోకి ఒప్పో ఏ 38 సిరీస్‌ ఫోన్‌!
New Update

Oppo A38 Mobile : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ ఒప్పో ఏ సిరీస్ లో మరో స్మార్ట్‌ ఫోన్‌ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమయ్యింది. ఒప్పో ఏ 38 పేరుతో యూఏఈ, మలేషియా అంతర్జాతీయ మార్కెట్ లోకి సీక్రెట్ గా వచ్చి రిలీజయ్యింది. అతి త్వరలోనే ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి కూడా రానున్నట్లు సమాచారం.

ఒప్పో ఏ 38  ఫోన్స్‌ అన్ని ఒకే కాన్ఫిగరేషన్‌ లో వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరలో చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఒప్పో ఏ 38 స్మార్ట్‌ ఫోన్‌ (OPPO A38 Smart Phone) హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ తో 6.56 ఇంచెస్‌ ఐపీఎల్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లేతో ఉంటుంది. 4జీబీ రామ్‌ (4GB RAM), 128 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉండగా..మైక్రో ఎస్డీ కార్డ్‌ ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్‌ కలిగి ఉంటుంది.

ఒప్పో ఏ 38 స్మార్ట్ ఫోన్ 50 ఎమ్‌పీ (50 MP camera) ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మంచి ఫోటోల కోసం 2 ఎమ్ పీ ప్రోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు , వీడియో కాల్స్‌ కోసం ఫ్రంట్‌ కెమెరా కూడా 5 ఎమ్‌ పీ తో అందుబాటులో ఉంది. ఒప్పో ఏ 38 ఫోన్‌ భారీ 5,000 ఎమ్‌ ఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జీంగ్‌ కు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్‌ ఫోన్. సైడ్ ఫేసింగ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఇందులో ఉంది. ఒప్పో ఏ 38 స్మార్ట్ ఫోన్‌ మలేషియా 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపుగా రూ. 10,500గా ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ లలో అందుబాటులో ఉంటుంది.

Also Read: నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా? అయితే ఇది చదవండి..ఇక జన్మలో ఆ పని చేయరు!

#mobiles #oppo-a38-5g-mobile #oppo-a38-5g #oppo-a38-price-in-india #oppo-a38-phone-specifications #oppo-mobiles #oppo #oppo-a-38
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe