Megha Company: మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణ (Telangana) లోని నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కష్టార్జీతాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తోందెవరు. దొంగ బ్యాంకుల నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఫేక్ గాళ్ల గురించి RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు RTVలో 'ఆపరేషన్ దేశద్రోహం' చూడండి.
కేరళలో మేఘా నిర్మించిన రహదారుల్లో తీవ్ర నాణ్యతా లోపాలు ఇటీవలే బయటపడ్డాయి. మేఘా నిర్మించిన ఓ అండర్‌పాస్ డెక్‌స్లాబ్ కూలిన ఘటనపై విచారణ జరుగుతోంది. డెక్‌స్లాబ్‌తో పాటు గిర్డర్స్ జారిపడి మరో ప్రమాదం జరిగింది. దీంతో మేఘా నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కృష్ణారెడ్డికి జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మేఘా కట్టిన నిర్మాణాలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.