Uttar Pradesh: ‘ఆపరేషన్‌ భేడియా’.. కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ బహరాయిచ్‌ జిల్లా ప్రజలను చంపుకుతింటున్న తోడేళ్ల గుంపుపై సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆపరేషన్‌ భేడియా’లో భాగంగా తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు.

New Update
Uttar Pradesh: ‘ఆపరేషన్‌ భేడియా’.. కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ బహరాయిచ్‌ జిల్లా ప్రజలు తోడేళ్ల కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తోడేళ్ల గుంపు దాడులతో పలువురు ప్రాణాలు కోల్పోగా బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో ‘ఆపరేషన్‌ భేడియా’ పేరుతో ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. ఈ క్రమంలోనే యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కంటపడితే కాల్చివేయాంటూ అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సీఎం యోగి.. తోడేళ్లను పట్టుకోవడం కష్టంగా మారితే వాటిని కాల్చేయాలని సూచించారు. అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు