Ram Mandir : అంతా రామమయం... భారతదేశమంతా(India) రామమయం... అన్నట్టు ఉంది. దేశమంతా రామనామస్మరణ(Jai Shri Ram) తో ఊగిపోతోంది. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులు అందరూ అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని మోడీ(PM Modi) కూడా అయోధ్యకు వచ్చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీనికి సంబంధించిన క్రతువు మొదలైంది. మంగళ ధ్వనితో ఉదయం 10గంటలకు దీనిని ప్రారంభించారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందిక ఇపైగా సంగీత విద్వాంసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి నుంచి రెండున్నర గంటలపాటూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.
Also Read:వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం
84 సెకెన్ల పాటూ శుభగడియలు...
అయోధ్య(Ayodhya) భవ్య రామమందిరం(Ram Mandir) లో ఈరోజు మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ప్రాణ ప్రతిష్ట జరగనుంది. 84సెకన్ల పాటు ఉండే శుభ ఘడియల్లో బాలరాముడు కొలువవనున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) బాల రాముడి నేత్రోన్మీలనం అంటే విగ్రహం కళ్ళకు కట్టిన పుసుపు వస్త్రాన్ని తొలగించి.. తొలి దర్శనం చేసుకుంటారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత హెలికాఫ్టర్‌లో పూల వర్షం కురిపిస్తారు. అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తాయి. తరువాత మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
ఈసాటితో భారతీయుల 500 ఏళ్ళ నాటి కల నిజమవుతోంది. 1528 నుంచి సాగుతున్న పోరాటాలకు ఇంతటి స్వస్తి పలకనున్నారు హిందువులు. పోరాడి సాధించుకున్న అయోధ్య రాముడిని సగర్వంగా, ఆంగరంగ వైభవంగా అయోధ్యలో కొలువుదీర్చుకుంటున్నారు.