OpenAI Sara : టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతోందో కదా. సరే.. ఆ మార్పులను కూడా మనం తెలుసుకుంటూ ముందుకుపోవాలి. మారుతున్న టెక్నాలజీతో ఎంతో ఆశ్చర్యం కలుగడం సహజం. కొత్తగా వచ్చినపుడు అది వింతగానే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏఐ తో వస్తున్న మార్పులు చూస్తే, ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. రాబోయే రోజుల్లో సాధారణ ఉద్యోగాల పరిస్థితి ఏమవుతుందా అని అనిపిస్తుంది. ముందు ఇక్కడ ఈ వీడియో చూడండి..
పై వీడియో చూశారు కదా? మీకేమనిపిస్తుంది? ఒక ఊరిలో.. ఒక బజారులో కొంతమంది యువకులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.. అంతే కదా. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలిస్తే మాత్రం అంతేకాదా అనరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. ఎందుకంటే, ఇది ఒరిజినల్ వీడియో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సృష్టి. ‘’నాకు ఒక బజారులో నలుగురు యువకులు కూచుని మాట్లాడుకుంటున్న వీడియో కావాలి. ఆ బజారును డ్రోన్ షాట్(Drone Shot) లో చూపించాలి’’ అని అడిగితే.. ఇదిగో ఇలాంటి వీడియో వచ్చేసింది. అవును.. ఇది నిజం.. చాట్ జీపీటీ AI ద్వారా మరో సంచలనం సృష్టించబోతోంది. తన OpenAI ద్వారా Soraని పరిచయం చేస్తోంది. ఇది మనం ఇచ్చిన ప్రాంప్టుల ఆధారంగా ఒక్క నిమిషం వీడియోలను సిద్ధం చేసి ఇస్తుంది. అదీ ఒక్క నిమిషంలోనే.. ఇప్పుడు ఇంకో వీడియో చూడండి..
Also Read : AI Fitness Trainer: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మొదటి జిమ్ ఎక్కడంటే..
ఒక నది పైకి ఉన్న చెట్టు కొమ్మమీద అందమైన మూడు పక్షులు.. భలే ఉంది కదా. ఇదిగో ఇలా అడిగితె ఈ వీడియో వచ్చింది. ప్రస్తుతం ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ OpenAI Sara అందరికీ అంటే ChatGPT మెంబర్స్ కి అందుబాటులోకి వస్తుందని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్(Sam Altman) తన X ఎకౌంట్ లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. ఆయన ఆ పోస్ట్ చేస్తూ.. OpenAI Sara ని పరిచయం చేస్తున్నానని చెప్పి.. తన ఫాలోవర్స్ ని ఏదైనా ప్రాంప్ట్ చెబితే, వీడియో OpenAI Sara ద్వారా వస్తుందని చెప్పారు. చాలామంది ఆ పోస్ట్ పై ప్రాంప్ట్స్ పంపించారు. ఇదిగో ఆయన పెట్టిన X పోస్ట్..
ఇక ఇలా వీడియోలు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని. అభ్యంతరకమైన విషయాలు.. సీలబ్రిటీల పోలికలతో వీడియోల కోసం వచ్చే అభ్యర్ధనలు (ప్రాంప్ట్స్) అలాగే విద్వేషాలు రేకెత్తించే వీడియోల కోసం వచ్చే ప్రాంప్ట్స్ వంటి అన్నిటినీ తమ AI వడబోస్తుందనీ.. ఎట్టిపరిస్థితిలోనూ అటువంటి కంటెంట్ వీడియోలు రావని చాట్ జీపీటీ భరోసా ఇస్తోంది. ఇదిగో ఇక్కడ ఇంకో వీడియో కూడా ఉంది చూసేయండి..
చూశారుగా… ఇదీ కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఏదైనా వీడియో చేయాలంటే.. భుజాన కెమెరా తగిలించుకుని.. యాంకర్ మేకప్ వేసుకుని.. రోడ్లమీద తిరగాల్సిన అవసరం లేకుండా పోయే రోజులు వచ్చేస్తున్నాయి. వీడియో షూట్ చేశాక ఎడిటింగ్ కోసం గంటల తరబడి కూచోవాల్సిన పని కూడా ఉండకపోవచ్చు. పైన ఉన్న వీడియోల క్లారిటీ చూశారుగా. ఇలాంటి వాటితో భవిష్యత్ లో మన యూట్యూబ్ ఛానల్ నిండిపోతుంది అనడం ఏమీ అతిశయోక్తి కాదు. మరి చూడాలి ఈ టెక్నాలజీ తీసుకువచ్చే మరిన్ని మార్పులు ఏమిటో. ప్రస్తుతానికి వీడియోలు చేయాలంటే తిప్పలు పడటం తప్పదు.
Also Read: వీడు మామూలోడు కాదు.. చందమామ పైకి.. మస్క్ మూన్ ల్యాండర్..
Watch this Interesting Video: